చనిపోయిన పిల్లను ఎత్తుకుని తల్లి ఏనుగు తపన..! మందతో కలిసి 7 కిలోమీటర్లు నడిచి..చివరకు..
ఏ తల్లి అయినా తన పిల్లలు ఆపదలో ఉంటే తట్టుకోలేదు. కన్నబిడ్డల కష్టాలు తీర్చటానికి ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంది అమ్మ. పిల్లలకు చిన్నపాటి కష్టం కూడా రానివ్వకుండా చూసుకుంటుంది. అది మనిషి అయినా పశువు అయినా తల్లి ప్రేమలో తేడా ఉండదు.
Elephant viral news: ఏ తల్లి అయినా తన పిల్లలు ఆపదలో ఉంటే తట్టుకోలేదు. కన్నబిడ్డల కష్టాలు తీర్చటానికి ప్రాణాలను సైతం ఫణంగా పెడుతుంది అమ్మ. పిల్లలకు చిన్నపాటి కష్టం కూడా రానివ్వకుండా చూసుకుంటుంది. అది మనిషి అయినా పశువు అయినా తల్లి ప్రేమలో తేడా ఉండదు. తాజాగా ఓ ఏనుగుకి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో బిడ్డకోసం ఓ తల్లి ఏనుగు కనబరిచిన తెగువకు నెటిజ్లు ఫిదా అవుతున్నారు. తల్లి ఏనుగుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏం జరిగిందో తెలుసుకుందాం. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ ఏనుగుల గుంపుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. బనార్హాట్ బ్లాక్‌లోని డోర్స్ ప్రాంతంలో చునాభతి టీ తోటలో జరిగింది ఈ ఘటన.
పశ్చిమ బెంగాల్‌లో లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తుంది. ఓ ఏనుగు.. తన చనిపోయిన పిల్లను తన తొండంతో పట్టుకుని గట్టి గట్టిగా అరుస్తూ.. ఒక తోట నుంచి మరోక తోటకు నడిచింది. బిడ్డను ఎత్తుకుని దాదాపు 7 కిలో మీటర్లు ప్రయాణించింది. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. 30-35 ఏనుగుల గుంపు చనిపోయిన దూడను ఎత్తుకుని 7 కిలోమీటర్లు ప్రయాణించింది తల్లి ఏనుగు. దాంతోపాటే ఏనుగుల గుంపు ఒక తోట నుంచి మరో తోటకు కనీసం 7 కి.మీ దూరం ప్రయాణించాయి. భీకర శబ్ధాలు చేస్తూ ఒక్కసారిగా వచ్చిన ఏనుగుల మందను చూసిన ప్రజలను భయాందోళనకు గురయ్యాయరు. ఏ క్షణంలో ఏనుగులు ఎలాంటి విద్వంసం సృష్టిస్తాయోనని ప్రజలు భయపడిపోయినట్టు అధికారులు తెలిపారు.
ఇంతకీ ఇక్కడ ఏం జరిగిందంటే…శనివారం ఉదయం బనార్హాట్ బ్లాక్‌లోని డోర్స్ ప్రాంతంలోని చునాభతి టీ తోటలో ఓ ఏనుగుపిల్ల చనిపోయింది. చనిపోయిన ఆ ఏనుగు పిల్లను తన తల్లి తొండంతో పట్టుకుని తన మందతో కలిసి ఒక తేయాకు తోట నుంచి మరో తేయాకు తోటకు బయల్దేరింది. ఆ ఏనుగుల గుంపు.. మొదట చునాభటి నుండి అంబారీ టీ గార్డెన్, డయానా టీ గార్డెన్, నుడువార్స్ టీ గార్డెన్‌లకు వెళ్లి రెడ్‌బ్యాంక్ టీ గార్డెన్‌లోని పొద దగ్గర పిల్ల మృతదేహాన్ని ఉంచింది.
#WATCH | WB: A mother elephant seen carrying carcass of her dead calf in Ambari Tea Estate, Jalpaiguri. A team of Binnaguri wildlife reached there to retrieve the carcass but elephant walked away to Redbank Tea Estate. Cause of death yet to be ascertained.
(Source: Unverified) pic.twitter.com/cPFSWtRDGk
— ANI (@ANI) May 27, 2022
ప్రస్తుతం ఏనుగులు తిరిగి అడవిలోకి వెళ్లిపోయాయని అధికారులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ సిబ్బంది పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్టు చెప్పారు.