Viral Video: ఇదెక్కడి మాస్ మావ.. పూల దండలు కాదు.. పాము దండలు.. వీడియో చూస్తే దిమాక్ ఖరాబ్

నూతన వధూవరులు పూల దండలను మార్చుకోవడం ఆనవాయితీ. కానీ వీరు మాత్రం ఫర్ ఏ ఛేంజ్..ప్రాణాంతకమైన పాము దండలను ఒకరి మెడలో మరొకరు వేసుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Viral Video: ఇదెక్కడి మాస్ మావ.. పూల దండలు కాదు.. పాము దండలు.. వీడియో చూస్తే దిమాక్ ఖరాబ్
Snake Garlands
Follow us
Ram Naramaneni

|

Updated on: May 30, 2022 | 12:51 PM

SNAKE garlands:పాము అంటే చాలామందికి భయం ఉంటుంది. అది కనబడితే చాలు.. ఆమడదూరం పరిగెడతారు. అది ప్రమాదకారి అయినా.. కాకపోయినా కొంతమంది అయితే ఫోన్‌లో పామును చూసిన భయపడతారు. ఎందుకంటే పాములు రూపమే భయానకంగా ఉంటుంది. అందులో అవి కరిస్తే చాలా డేంజర్.  ఒక్క కాటుతో మనుషుల జీవితాలను ఖతం చేస్తాయి. తాజాగా ఓ క్రేజీ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియో చూస్తే ఒక్క క్షణం మీ మైండ్ బ్లాంక్ అవుతుంది. ఇందులో వధూవరులు తమ వివాహ సమయంలో దండలు మార్చుకున్నారు. అయితే అవి పూల దండలు కాదండోయ్.. పాము దండలు. అవును, మీరు సరిగ్గానే చదివారు!. మహారాష్ట్ర(Maharashtra)లోని బీడ్ జిల్లాలోని మారుమూల గ్రామంలో వధూవరులు పూల దండలకు బదులుగా ప్రాణాంతకమైన పాము దండలను మార్చుకున్నారు. ఇది అక్కడ ఆచారమట. అలా పామును మెడలో వేసినప్పటికీ వధూవరులు కొంచెం కూడా భయపడలేదు. వధువు మొదట వరుడి మెడలో ఓ నాగు పామును వేసింది.  ఆ పాము మెడలో ఉండగానే జంట ఫోటోగ్రాఫ్‌లకు పోజులిచ్చింది. వరుడి వంతు రాగానే పెద్ద కొండచిలువను తీసుకొచ్చి వధువు మెడలో వేశాడు. ఈ ఘటన జరుగుతుండగా చుట్టూ  భారీ ఎత్తున జనం ఉండటం కూడా మీరు చూడవచ్చు. కాగా వధూవరులు ఇద్దరూ స్థానిక వన్యప్రాణి విభాగంలో పనిచేస్తున్నట్లు తెలిసింది.

వీడియోపై మీరూ ఓ లుక్కేయండి

ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ విచిత్ర సంప్రదాయాన్ని చూసి.. నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.  ఇది పాత వీడియోనే అయినప్పటికీ.. మరోసారి నెట్టింట వైరల్ అవుతుంది.

(అక్కడ సంప్రదాయం కాబట్టి వారు అధికారుల అనుమతితో ఇలా చేశారు. దయచేసి మీరు ఇలాంటి పనులు చేయవద్దు. ప్రాణాలకే ప్రమాదం)

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..