AP Weather: ఏపీ ప్రజలకు కూల్‌ న్యూస్.. రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు: వాతావరణశాఖ

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవావరణ కేంద్రం వెల్లడించింది.

AP Weather: ఏపీ ప్రజలకు కూల్‌ న్యూస్.. రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు: వాతావరణశాఖ
Rains
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 30, 2022 | 4:12 PM

AP Rain Alert: రాగల మూడు రోజులు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఆదివారం కేరళలో ప్రవేశించిన విషయం తెలిసిందే. రాగల 3 రోజుల్లో మరింత ముందుకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ప్రభావంతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని మరి కొన్ని ప్రాంతాలు, దక్షిణ & మధ్య బంగాళాఖాతంలో తదుపరి 3-4 రోజులలో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

మూడు రోజులకు వాతావరణ సూచనలు..

రాబోవు రెండు రోజులలో రాష్ట్రమంతా గరిష్ట ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే 2 – 4 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ఉత్తర కోస్త – యానాం: ఈ రోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా: ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు మరికొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఈ రోజు రేపు, ఎల్లుండి ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.

రాయలసీమ: ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..