Special Trains: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని సమ్మర్ స్పెషల్ రైళ్లు..
Railway News: తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణీకులకు మరో గుడ్ న్యూస్. వేసవి సీజన్ నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతున్న రైల్వే శాఖ..
Special Trains: తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణీకులకు మరో గుడ్ న్యూస్. వేసవి సీజన్ నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతున్న రైల్వే శాఖ.. తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ – విశాఖపట్నం , విశాఖపట్నం – మహబూబ్ నగర్ మధ్య వీక్లీ ప్రత్యేక రైళ్లను నడపనుంది. జూన్ 1 తేదీ నుంచి 29వ తేదీ వరకు( ప్రతి బుధవారం) విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు(నెం.08579) ఐదు సర్వీసులు నడపనున్నారు. అలాగే జూన్ 2 తేదీ నుంచి 30వ తేదీ వరకు (ప్రతి గురువారం) సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు(నెం.08580) ఐదు సర్వీస్‌లు నడపనున్నారు. అలాగే జూన్ 7వ తేదీ నుంచి 28వ తేదీ వరకు విశాఖపట్నం నుంచి మహబూబ్ నగర్‌కు (ప్రతి మంగళవారం) నాలుగు సర్వీసులు ప్రత్యేక రైళ్లను(నెం.08585) నడపనున్నారు. జూన్ 8వ తేదీ నుంచి 29వ తేదీ వరకు (ప్రతి బుధవారం) మహబూబ్ నగర్ నుంచి విశాఖపట్నంకు నాలుగు సర్వీసుల ప్రత్యేక రైళ్ల(నెం.08586)ను నడపనున్నారు.
విశాఖపట్నం – సికింద్రాబాద్ – విశాఖపట్నం స్పెషల్..
విశాఖపట్నం -సికింద్రాబాద్ ప్రత్యేక వీక్లీ స్పెషల్ విశాఖపట్నం నుంచి సాయంత్రం 07 గం.లకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 7 గం.లకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అలాగే సికింద్రాబాద్ -విశాఖపట్నం మధ్య నడిచే ప్రత్యేక వీక్లీ స్పెషల్ సాయంత్రం 07.40 గం.లకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 06.40 గం.లకు విశాఖపట్నం చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.
విశాఖపట్నం – మహబూబ్ నగర్- విశాఖపట్నం వీక్లీ స్పెషల్..
విశాఖపట్నం – మహబూబ్ నగర్ వీక్లీ స్పెషల్ విశాఖపట్నంలో సాయంత్రం 7 గం.లకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.30 గం.లకు మహబూబ్‌నగర్ కు చేరుకుంటుంది. మహబూబ్ నగర్ – విశాఖపట్నం వీక్లీ స్పెషల్ సాయంత్రం 06.20 గం.లకు మహబూబ్ నగర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు 09.50 గం.లకు విశాఖపట్నం చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, మల్కాజ్‌గిరి, కాచిగూడ, ఉందానగర్, షాద్ నగర్, జడ్జెర్ల రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.
కాచిగూడ-తిరుపతి-కాచిగూడ సమ్మర్ స్పెషల్..
ఇందులో భాగంగా కాచిగూడ-తిరుపతి మధ్య రెండు సమ్మర స్పెషల్ ట్రైన్స్‌ను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ఓ ప్రకటనలో తెలిపింది. ప్రత్యేక రైలు (నెం.07297) జూన్ 1 తేదీన (బుధవారం) రాత్రి 10.20 గం.లకు కాచిగూడ నుంచి బయలుదేరి.. మరుసటి రోజు మధ్యాహ్నం 11 గం.లకు తిరుపతి చేరుకుంటుంది. అలాగే మరో ప్రత్యేక రైలు (నెం.07298) జూన్ 2న (గురువారం) మధ్యాహ్నం 03 గం.లకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు వేకువజామున 04 గం.లకు కాచిగూడకు చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు రెండు మార్గాల్లోనూ ఉందానగర్, షాద్‌నగర్, జడ్జెర్చ, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపర్తి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట్, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ ఏసీ, ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.
#Kacheguda – #Tirupati – Kacheguda Summer Special Trains @drmhyb @drmsecunderabad @drmgtl pic.twitter.com/r5lBhG2bKW
— South Central Railway (@SCRailwayIndia) May 30, 2022
మరిన్ని ఏపీ వార్తలు చదవండి..