Andhra Pradesh: తొలుత వద్దన్నారు.. తర్వాత ఆశీర్వదించారు.. ఆర్నెళ్లలో రెండోసారి పెళ్లి!

ఓ వైపు తల్లిదండ్రుల ఆదరణ.. మరోవైపు కోరుకున్న భర్త తో జీవితం.. అంతకు మించి ఏ ఆడపిల్లకైనా కావాల్సింది ఏముంటుంది. ఆరునెలల్లోనే రెండు సార్లు పెళ్లితో ఈ జంట కథ సుఖాంతమైంది.

Andhra Pradesh: తొలుత వద్దన్నారు.. తర్వాత ఆశీర్వదించారు.. ఆర్నెళ్లలో రెండోసారి పెళ్లి!
Love Arrange Marriage
Follow us
Surya Kala

|

Updated on: May 30, 2022 | 2:38 PM

Andhra Pradesh: తాము అల్లారు ముద్దుగా కోరింది అడిగిన వెంటనే తమ పిల్లలకు ఇచ్చే తల్లిదండ్రులు.. పెళ్లి విషయంలో మాత్రం కోరిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఇవ్వడానికి ఎందుకో ఆలోచిస్తారు. ముఖ్యంగా కూతురు పెళ్లి విషయంలో కన్నతల్లిదండ్రులు తీసుకునే కేరింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ఇక తమ పిల్లలు ప్రేమించారు అనగానే తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేయడం సర్వసాధారణం. దీనికి కారణం కులం, మతం, ఆర్ధిక సామజిక వ్యత్యాసాలు అని చెప్పవచ్చు. అయితే తమ మాటను కాదని పెళ్లి చేసుకునే తమ పిల్లల విషయంలో కొంతమంది తల్లిదండ్రులు కఠిన నిర్ణయం తీసుకుంటున్నారు.. ఏకంగా హత్యలు చేయడం వరకూ వెళ్తున్న సంఘటనలు గురించి మనకు తెలిసిందే.. అయితే ప్రస్తుతం ఓ తల్లిదండ్రులు తాము అందుకు భిన్నం అనిపించారు.  తమని కాదని పెళ్లి చేసుకున్న తమ పిల్లల ప్రేమను అర్ధం చేసుకుని ఆరునెలల తర్వాత మనసు మార్చుకుని పెళ్ళికి అంగీకారం తెలిపారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తోన్న లక్ష్మి అనే యువతి ఓ యువకుడిని ప్రేమించింది. పెళ్లి కోసం లక్ష్మి తన తల్లిదండ్రుల అంగీకారం కోరింది. అయితే అబ్బాయిది తమ కులం  కాకపోవడంతో పెళ్లికి అభ్యంతరం చెప్పారు. దీంతో లక్ష్మి తాను ప్రేమించిన అబ్భాయిని ఆరునెలల క్రితం ఆర్య సమాజంలో పెళ్లి చేసుకుంది. తన అత్తగారిల్లైన  ఆంధ్రప్రదేశ్ లోని చీరాలకు నవ దంపతులు వెళ్లిపోయారు.

అయితే లక్ష్మి చెల్లికి పెళ్లి సంబధంలు చూసే సందర్భంలో కూతురు కులాంతర విషయం గురించి తల్లిదండ్రులు చెప్పారు. ఇప్పుడు ఆ యువతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వరుడు.. అతని కుటుంబం లక్ష్మి కులాంతర వివాహం పై తమకు అభ్యంతరం లేదని చెప్పారు.. లక్ష్మి చెల్లెలు తమ ఇంటి కోడలుగా ఆహ్వానిస్తామని అంగీకరించారు. దీంతో లక్ష్మితల్లిదండ్రులకు ఉన్న భయం పోయింది. తమ పెద్ద కూతురు అల్లుడిని ఇంటికి ఆహ్వానించారు. అంతేకాదు తామే స్వయంగా మళ్ళీ  హిందూ సంప్రదాయం ప్రకారం అంగరంగ వైభంగా వివాహం చేశారు. దీంతో లక్ష్మి సంతోషానికి ఆకాశమే హద్దు అయ్యింది. ఓ వైపు తల్లిదండ్రుల ఆదరణ.. మరోవైపు కోరుకున్న భర్త తో జీవితం.. అంతకు మించి ఏ ఆడపిల్లకైనా కావాల్సింది ఏముంటుంది.  ఆరునెలల్లోనే రెండు సార్లు పెళ్లితో ఈ జంట కథ సుఖాంతమైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రపదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..