తూర్పుగోదావరి జిల్లాలో కరోనా వ్యాప్తి కేంద్రాలుగా చేపల మార్కెట్లు.. నిబంధనలు పట్టించుకోని జనాలు
ఏపీలో కరోనా విజృంభిస్తుండటంతో పలు చోట్ల వారాంతపు సంతలు నిషేధించారు. ప్రజలు ఎక్కువగా గుమిగూడే అవకాశం ఉన్న సంతలు కొంతకాలం....
ఏపీలో కరోనా విజృంభిస్తుండటంతో పలు చోట్ల వారాంతపు సంతలు నిషేధించారు. ప్రజలు ఎక్కువగా గుమిగూడే అవకాశం ఉన్న సంతలు కొంతకాలం నిర్వహించొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కూరగాయలు, నిత్యావసర సరుకుల కొనుగోలుకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో వారాంతపు సంతలు కూడా తెరుచుకుంటున్నాయి. తూర్పుగోదావరి జిల్లా అంబాజిపేటలో అధికారుల నిషేధం ఉన్నా వారాంతపు సంత ఆగడం లేదు. చేపల విక్రయానికి ఫేమస్‌గా మారిన అంబాజీపేట వారాంతపు సంతకు ఎక్కడెక్కడి నుంచో తరలొస్తుంటారు. ఈ క్రమంలోనే కరోనాను సైతం లెక్క చేయకుండా భారీ ఎత్తున చేపల మార్కెట్ జనం తరలి వస్తున్నారు. వారాంతపు సంతలో కరోనా నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఎక్కడపడితే అక్కడ గుంపులు గుంపులుగా జనం గుమిగూడుతున్నారు. కోనసీమలో అధికంగా కేసులు నమోదు అవుతునప్పటికి కనీస జాత్రత్తలు తీసుకోవడం లేదు. కరోనా పట్ల ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం కరోనా ఎలాంటి డ్యామేజ్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆకస్మాత్తుగా ఆప్తులను కోల్పోతున్నాం. తేరుకునేలోపు మనుషులు మనవాళ్లు కాకుండా పోతున్నారు. నివారణ కంటే వ్యాధి రాకుండా చేయడమే ముఖ్యం. ఈ క్రమంలో ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి. భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. ఎప్పటికప్పుడు చేతులను శానిటైజ్ చేస్తూ.. జాగ్రత్తలు పాటించాలి.
Also Read: ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆపరేషన్ ముస్కాన్’ మళ్లీ వేగవంతం.. డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలక ఆదేశాలు