Tragedy: 5 రోజుల క్రితమే పెళ్లి.. చికెన్ తెచ్చేందుకు వెళ్లి.. అనంతలోకాలకు
ఆ ఇంటికి ఇంకా పచ్చని తోరణాలు వేలాడుతూనే ఉన్నాయి. బంధుమిత్రుల సందడి ఇంకా తగ్గలేదు. ఇంతలో ఊహించని ప్రమాదం ఆ కుటుంబాన్ని...
ఆ ఇంటికి ఇంకా పచ్చని తోరణాలు వేలాడుతూనే ఉన్నాయి. బంధుమిత్రుల సందడి ఇంకా తగ్గలేదు. ఇంతలో ఊహించని ప్రమాదం ఆ కుటుంబాన్ని వెంటాడింది. అయిదురోజుల క్రితమే పెళ్లి జరిగిన ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది. యాక్సిడెంట్ రూపంలో మృత్యువు నవవరుడిని కబళించింది. ఒడిశా రాష్ట్రం బొరడా గ్రామం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంతో ఇచ్ఛాపురం మండలంలోని మండపల్లికి చెందిన యువకుడు ప్రాణాలు విడిచాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు… శ్రీకాకుళం జిల్లా మండపల్లికి చెందిన పాతిర్ల కుమార్(27)కు ఈనెల 13న అదే ఊరికి చెందిన ఓ యువతితో పెళ్లి జరిగింది. ఇంట్లో బంధువులంతా ఉండడంతో కుమార్ సోమవారం చికెన్ తేచ్చేందుకు పక్కనున్న ఒడిశాలోని దన్‌ఘర్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి బైక్ ప తిరిగి వస్తుండగా బొరడా వద్ద ఎదురుగా వస్తున్న లగేజీ వ్యాన్.. ఊహించనివిధంగా ఢీకొట్టడంతో కుమార్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఒడిశాలోని హాస్పిటల్ కు తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం బంధువులకు సమాచారం అందించగా బ్రహ్మపురకి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించగా కుమార్ చనిపోయాడు. ఈ ఘటనతో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Also Read: కొన్ని నెలలుగా ఆ అంగన్‌వాడీ టీచర్ స్కూల్‌కు వెళ్లలేదు.. అధికారుల మెమో, ఇంతలోనే..