బయటకు వెళ్లి తెల్లారే వరకు ఇంటికి రాలేదు.. పక్కింట్లో మోగిన అతడి ఫోన్ అలారం.. వెళ్లి చూడగా షాక్
పిల్లలు పుట్టడం అనేది ప్రతి తల్లిదండ్రుల జీవితంలో బెస్ట్ మూమెంట్. పిల్లల్ని కని, పెంచి, పెద్దచేసి.. ప్రయోజకులను చేయాలని చాలామంది దంపతులు ఆశపడతారు...
పిల్లలు పుట్టడం అనేది ప్రతి తల్లిదండ్రుల జీవితంలో బెస్ట్ మూమెంట్. పిల్లల్ని కని, పెంచి, పెద్దచేసి.. ప్రయోజకులను చేయాలని చాలామంది దంపతులు ఆశపడతారు. పిల్లలు పుట్టడం లేటయితే నైరాశ్యంలోకి వెళ్లిపోతారు. ఇక బంధువులు, బయటవాళ్ల నుంచి సూటిపోటి మాటలు ఉండనే ఉంటాయి. తాజాగా హైదరాబాద్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పెళ్లైనా పిల్లలు పుట్టడం లేదన్న మనస్తాపంతో ఓ వ్యక్తి సూసైడ్ చేసకున్నాడు. కట్టుకున్న భార్యను ఒంటరి చేసి.. తనువు చాలించాడు. ఈ ఘటన కేపీహెచ్‌బీ కాలనీలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. వసంత్‌నగర్ ఫ్లాట్ నెంబర్ 214లో రాహుల్ (34) రమ్య అనే కపుల్ నివాసం ఉంటున్నారు. వీరికి పెళ్లై ఏడు సంవత్సరాలు గడిచాయి. అయితే ఇంతవరకు పిల్లలు మాత్రం కలగలేదు. దీంతో దంపతులిద్దరూ పిల్లలు లేరన్న ఆవేదనతో నిత్యం బాధపడుతూ ఉండేవారు. చాలామంది డాక్టర్ల చుట్టూ తిరిగినా.. ఫలితం లేకుండా పోయింది.
ముఖ్యంగా రాహుల్ ఎక్కువగా ఆవేదన చెందుతూ ఉండేవాడు. సోమవారం సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్లి రావాలని భార్య చెప్పింది. దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాహుల్.. రాత్రివరకు తిరిగిరాలేదు. ఆందోళన చెందిన రమ్య భర్త కోసం తెలిసినవారికి ఫోన్ చేసి కనుక్కుంది. ఎక్కడా అతని ఆచూకీ లభించలేదు. సోమవారం రాత్రంతా ఇంట్లోనే భర్త కోసం వేచి చూసింది. ఇదే సమయంలో తెల్లవారడంతో రమ్యకు పక్కింట్లో నుంచి ఏదో సౌండ్ వినిపించింది.
వెంటనే ఆ డోర్ వద్దకు వెళ్లగానే తన భర్త ఫోన్ అలారం సౌండ్ రావడంతో కంగారుపడింది. భయంతోనే లోపలికి వెళ్లగా.. భర్త విగతాజీవిగా కనిపించాడు. అదే ఇంట్లో కిచెన్‌లో అమర్చిన సీలింగ్ ఫ్యాన్‌కు రాహుల్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలు పుట్టడం లేదని ఆత్మహత్య చేసుకున్న భర్తను చూసి భార్య కన్నీరు మున్నీరుగా విలపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని.. విచారణ చేస్తున్నారు.
Also Read: విధుల్లో ఉద్యోగుల నిర్లక్ష్యం.. షాకిచ్చిన చిత్తూరు కలెక్టర్.. జీతాలు నిలిపివేస్తూ ఉత్తర్వులు