Harinarayan: విధుల్లో ఉద్యోగుల నిర్లక్ష్యం.. షాకిచ్చిన చిత్తూరు కలెక్టర్.. జీతాలు నిలిపివేస్తూ ఉత్తర్వులు

Chittoor Collector Harinarayan: చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు.. తమ పనిని పూర్తిచేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఒకవేళ చేయకపోయినా..

Harinarayan: విధుల్లో ఉద్యోగుల నిర్లక్ష్యం.. షాకిచ్చిన చిత్తూరు కలెక్టర్.. జీతాలు నిలిపివేస్తూ ఉత్తర్వులు
Chittoor Collector Harinarayan
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 19, 2021 | 5:53 AM

Chittoor Collector Harinarayan: చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు.. తమ పనిని పూర్తిచేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఒకవేళ చేయకపోయినా.. ప్రభుత్వ ఉద్యోగం.. నెల పూర్తయితే తమ జీతం తమకు వస్తుందంటూ ధీమా వ్యక్తంచేస్తుంటారు. అలాంటి వారి పట్ల ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కలెక్టర్‌ హరినారాయణన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. 5 మండలాల ఉద్యోగుల జీతాలు నిలుపుదల చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని పెదమండ్యం, తవణంపల్లె, శ్రీకాళహస్తి, సత్యవేడు, మదనపల్లె మండలాల్లోని రెవెన్యూ, పంచాయతీరాజ్, హెల్త్, సచివాలయం, మునిసిపల్ శాఖల ఉద్యోగుల నెలవారీ జీతాలను నిలిపివేస్తున్నట్లు హరినారాయణన్ వెల్లడించారు.

ఆయా మండలాల పరిధిలో ఆరో విడత ఫీవర్ సర్వేలో పలు శాఖల అధికారులు నిర్లక్ష్యం వహించారని హరినారాయణన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారందరిపై విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఆదేశాలను బేఖాతరు చేసిన వారిపైనా ఇదే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటానంటూ తీవ్రంగా హెచ్చరించారు. వారందరికీ.. జీతాలు నిలిపివేయాలని జిల్లా ట్రెజరీని ఆదేశించారు. ఇంకా ఎవరైనా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవంటూ సూచనలు చేశారు.

Also Read:

మాకు భారత ప్రజలే ముఖ్యం, వారిని కాదని వ్యాక్సిన్ విదేశాలకు ఎగుమతి చేయలేదు, సీరం కంపెనీ సీఈఓ ఆదార్ పూనావాలా స్పష్టీకరణ

CBSE 12th Board Exam: సీబీఎస్‌ఈ 12 బోర్డు పరీక్ష రద్ధుపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!