మాకు భారత ప్రజలే ముఖ్యం, వారిని కాదని వ్యాక్సిన్ విదేశాలకు ఎగుమతి చేయలేదు, సీరం కంపెనీ సీఈఓ ఆదార్ పూనావాలా స్పష్టీకరణ
తమకు భారత ప్రజలే ముఖ్యమని, వారిని కాదని తాము విదేశాలకు వ్యాక్సిన్ ఎగుమతి చేయలేదని సీరం సంస్థ సీఈఓ ఆదార్ పూనావాలా స్పష్టం చేశారు. ఇండియాలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉన్నప్పుడు ఈ నెలారంభంలో ఆయన బ్రిటన్ వెళ్లిన సంగతి గమనార్హం...
తమకు భారత ప్రజలే ముఖ్యమని, వారిని కాదని తాము విదేశాలకు వ్యాక్సిన్ ఎగుమతి చేయలేదని సీరం సంస్థ సీఈఓ ఆదార్ పూనావాలా స్పష్టం చేశారు. ఇండియాలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉన్నప్పుడు ఈ నెలారంభంలో ఆయన బ్రిటన్ వెళ్లిన సంగతి గమనార్హం. ఇదే సమయంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచాలని సీరం సంస్థపై ఒత్తిడి పెరిగింది. ఆయన యూకే వెళ్లిన కారణంగానే ఈ టీకామందు ఉత్పత్తి తగ్గిందన్న వార్తలు కూడా వచ్చాయి. దీనిపై స్పందించిన ఆయన.. వాటికీ ఆధారాలు లేవని పరోక్షంగా పేర్కొన్నారు. ఇండియాలో జనాభా ఎక్కువగా ఉన్నందున రెండు, మూడు నెలల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ పూర్తి చేయలేమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పాండమిక్ ని మనమంతా =కలిసి కట్టుగా ఎదుర్కొందామని ఆదార్ పూనావాలా అన్నారు. వివిధ దేశాల నుంచి మనకు ఇప్పుడు వ్యాక్సిన్, ఇతర కోవిద్ సాయం అందుతోందని, ఇది చెప్పుకోదగిన విషయమని పేర్కొన్నారు. తాము ఏ పరిస్థితుల్లో విదేశాలకు టీకామందు ఎగుమతి చేయాల్సి వచ్చిందో ఆయన వివరించారు. గత ఏడాది ప్రభుత్వం ఆయా దేశాలకు ఈ మేరకు ‘కమిట్ మెంట్స్’ (హామీలు) ఇచ్చిందని, అందువల్ల వాటి మేరకు తాము నడచుకోవాల్సి వచ్చిందని చెప్పారు. జనవరిలో టీకామందును లాంచ్ చేసినప్పుడు కోవిడ్ కేసుల సంఖ్య తక్కువగా ఉంది.. అప్పుడు చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా సక్సెస్ అయింది అని పూనావాలా గుర్తు చేశారు. అయితే అదే సమయంలో పలు దేశాలు వ్యాక్సిన్ కోసం మన సాయం కోరాయని, అందుకు మనం కూడా స్పందించి వాటికీ సాయం చేశామని ఆయన అన్నారు.
ఈ పాండమిక్ కేవలం భౌగోళిక, రాజకీయ బౌండరీలకు పరిమితం కాదని ఆయన వ్యాఖ్యానించారు.ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారిని నిర్మూలించేంతవరకు ఎవరూ సేఫ్ కారు అని పేర్కొన్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ :రోడ్డు మధ్యలో ఏనుగు.. అప్పుడే బైక్ పై వచ్చిన యువకుడు.. అంతలోనే ఊహించని ఘటన.. చివరకు..