Plaint Against CM Vijayan: ముఖ్యమంత్రిపై కోవిడ్ ఉల్లంఘన కేసు.. ఫిర్యాదు చేసిన కేంద్ర మాజీ మంత్రి థామస్

కోవిడ్-19 ప్రోటోకాల్, ట్రిపుల్ లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేసు నమోదు చేయాలంటూ మాజీ కేంద్ర మంత్రి ఫిర్యాదు చేశారు.

Plaint Against CM Vijayan: ముఖ్యమంత్రిపై కోవిడ్ ఉల్లంఘన కేసు.. ఫిర్యాదు చేసిన కేంద్ర మాజీ మంత్రి థామస్
Ex Union Minister Files Plaint Against Cm Vijayan
Follow us

|

Updated on: May 18, 2021 | 9:54 PM

Cong Files Plaint Against CM Vijayan: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు పెట్టేందుకు సైతం వెనుకాడటం లేదు. ఇదే క్రమంలో కోవిడ్-19 ప్రోటోకాల్, ట్రిపుల్ లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కేసు నమోదు చేయాలంటూ మాజీ కేంద్ర మంత్రి ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు కేరళలోని తిరువనంతపురంలోని కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌లో మాజీ కేంద్ర మంత్రి, కేరళ కాంగ్రెస్ సీనియర్ నేత పీసీ థామస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి విజయన్ తోసహా మరో 22 మంది ఎల్డీఎఫ్ నేతలు ఏకేజీ సెంటర్‌లో కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా సమావేశం అయ్యారని ఆయన ఆరోపించారు. ఓ వైపు జిల్లా మొత్తం ట్రిపుల్ లాక్‌డౌన్‌లో ఉండగా కేక్ కట్ చేసి కనీసం భౌతిక దూరం నిబంధనలు కూడా పాటించకుండా అసెంబ్లీ ఎన్నికల విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారని ఆయన ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరిపై కేరళ అంటు వ్యాధుల నివారణ చట్టంతో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద శిక్షార్హమైన నేరమన్నారు. ఈ సమావేశానికి హాజరైన వారందరిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

మరోవైపు విజయన్‌తో పాటు ఈ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, మంత్రులు రాజ్యాంగంలోని మూడవ షెడ్యూల్ కింద చేసిన ప్రమాణాన్ని కూడా ఉల్లంఘించారనీ.. అలాంటి పదవుల్లో కొనసాగకుండా వారిని అనర్హులుగా ప్రకటించాలని థామస్ డిమాండ్ చేశారు. ‘‘ముఖ్యమంత్రి తన రోజువారీ మీడియా సమావేశాల్లో కరోనా వ్యాప్తిని నివారించేందుకు కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని తరచూ చెబుతుంటారు. అదే వ్యక్తి ఇప్పుడు అన్ని మార్గదర్శకాలను ఉల్లంఘించారు. టీవీల్లో వచ్చిన విజువల్స్ దీనికి ప్రత్యక్ష సాక్ష్యం..’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపించి, తగిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు.

Read Also….  Remdesivir Black Market: రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ బ్లాక్ మార్కెట్ రాకెట్ ర‌ట్టు.. నిందితుల్లో ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది!

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో