కోవిడ్ మహమ్మారికి ఏడాదిలో 300 మందికి పైగా జర్నలిస్టుల మృతి, వీరు ఫ్రంట్ లైన్ వర్కర్లు కారా ? అధ్యయన సంస్థ ఆవేదన

దేశంలో కోవిడ్ మహమ్మారి 300 మందికి పైగా జర్నలిస్టులను బలిగొంది. వీరిలో రిపోర్టర్లు, ఫ్రీలాన్స్ జర్నలిస్టులు, స్ట్రింగర్లు, కెమెరామెన్లు, ఫోటో జర్నలిస్టులు తదితరులు ఉన్నారని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సెప్షన్ స్టడీస్ అనే సంస్థ తన అధ్యయనంలో తెలిపింది...

కోవిడ్ మహమ్మారికి ఏడాదిలో 300 మందికి పైగా జర్నలిస్టుల మృతి, వీరు ఫ్రంట్ లైన్ వర్కర్లు కారా ? అధ్యయన సంస్థ ఆవేదన
Jenerlists

దేశంలో కోవిడ్ మహమ్మారి 300 మందికి పైగా జర్నలిస్టులను బలిగొంది. వీరిలో రిపోర్టర్లు, ఫ్రీలాన్స్ జర్నలిస్టులు, స్ట్రింగర్లు, కెమెరామెన్లు, ఫోటో జర్నలిస్టులు తదితరులు ఉన్నారని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సెప్షన్ స్టడీస్ అనే సంస్థ తన అధ్యయనంలో తెలిపింది. అత్యధికంగా తెలంగాణలో 39 మంది, ఆ తరువాత యూపీలో 37 మంది జర్నలిస్టులు కోవిడ్ కు గురై మృతి చెందారు.. ఫ్రంట్ లైన్ వర్కర్లుగా వీరిని ప్రభుత్వం గుర్తించలేదు సరికదా వ్యాక్సినేషన్ డ్రైవ్ లో కూడా వీరికి ప్రయారిటీ కల్పించలేదని ఈ సంస్ధ ఆవేదన వ్యక్తం చేసింది. ఏప్రిల్ లో రోజుకు సగటున ముగ్గురు, మే నెలలో నలుగురు చొప్పున ఈ వైరస్ కి బలయ్యారు. నగరాలు, పట్టణాలు, జిల్లాలు, గ్రామాల్లో సైతం ఈ మరణాలు సంభవించాయని ఈ సంస్థ వెల్లడించింది. తొలి దశ వేవ్ కన్నా సెకండ్ వేవ్ కోవిద్ దశలో మృతి చెందిన మీడియా జర్నలిస్టుల సంఖ్య ఎక్కువని పేర్కొంది. గత ఏడాది ఏప్రిల్-డిసెంబరు మధ్య 56 మంది, ఈ ఏడాది ఏప్రిల్ 1-మే 16 మధ్య 171 మంది మృతి చెందారని తెలిపింది. జనవరి-ఏప్రిల్ మధ్య కాలంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
న్యూస్ కవరేజీకి వెళ్తూ కొంతమంది ప్రాణాలు కోల్పోతే చాలామంది కోవిద్ కారణంగానే మరణించినా వారి కుటుంబాలకు పరిహారం అందిందా లేదా అన్నది ప్రశ్నార్థకమని ఈ సంస్థ తన స్టడీలో పేర్కొంది. ఇప్పటికైనా వీరిని కూడా ఫ్రంట్ లైన్ వర్కర్లుగా ప్రభుత్వం గుర్థించి వారి కుటుంబాలను ఆదుకోవాలని ఇన్స్ టిట్యూట్ ఆఫ్ పర్సెప్షన్ స్టడీస్ కోరుతోంది.

మరిన్ని చదవండి ఇక్కడ :రోడ్డు మధ్యలో ఏనుగు.. అప్పుడే బైక్ పై వచ్చిన యువకుడు.. అంతలోనే ఊహించని ఘటన.. చివరకు..

Grand Mother: బామ్మగారు..బంతాట..అదరగొట్టేశారు సుమండీ! మీరూ చూస్తే..వారెవ్వా బామ్మా అంటారు గ్యారెంటీగా..Viral Video

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu