రోడ్డు మధ్యలో ఏనుగు.. అప్పుడే బైక్ పై వచ్చిన యువకుడు.. అంతలోనే ఊహించని ఘటన.. చివరకు..

Viral Video: ఇటీవల కాలంలో గ్రామాల్లోకి ఏనుగులు ప్రవేశిస్తున్నాయనే సంఘటనలు వింటూనే ఉన్నాం. ఎప్పుడూ ఎక్కడి నుంచి ఏనుగుల గుంపు ఊర్లోకి వస్తుందో

రోడ్డు మధ్యలో ఏనుగు.. అప్పుడే బైక్ పై వచ్చిన యువకుడు.. అంతలోనే ఊహించని ఘటన.. చివరకు..
Viral

Viral Video: ఇటీవల కాలంలో గ్రామాల్లోకి ఏనుగులు ప్రవేశిస్తున్నాయనే సంఘటనలు వింటూనే ఉన్నాం. ఎప్పుడూ ఎక్కడి నుంచి ఏనుగుల గుంపు ఊర్లోకి వస్తుందో అని గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గత కొన్ని రోజులుగా పంట పొలాలపై ఈ ఏనుగుల గుంపులు దాడి చేసి పంటలను నాశనం చేస్తున్నాయి. అయితే కొన్ని సార్లు ఏనుగులు మనుషులు కనిపించిన ఏం చేయకుండా వదిలిపెట్టేస్తున్నాయి. ఇలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో… రహదారిపై అడ్డుగా పెద్ద ఏనుగు నిల్చోని ఉంది. దీంతో ఆ దారి వెంట వెళ్లాల్సిన వారు అక్కడే ఆగిపోయారు. కానీ ఆ ఏనుగు మాత్రం ఎక్కడికి వెళ్ళకుండా అలాగే రోడ్డుపై నిల్చోని ఉంది. ఇక అదే సమయంలో అటుగా ఓ వ్యక్తి స్కూటీపై వచ్చాడు. ఏనుగు ముందు నుంచి వెళ్ళపోతూ.. ఒక్కసారిగా అదుపు తప్పి కింద పడిపోయాడు. ఆ వ్యక్తి పడిపోయిన కానీ ఏనుగు అతడి దగ్గరికి రాకుండా అక్కడే నిల్చోని నెమ్మదిగా అతడిని చూస్తూ ఉంది. ఇక పడిపోయిన వ్యక్తి లేచి నెమ్మదిగా తన స్కూటీని పక్కకు తీసుకోని వెళ్లి తనకు తగిలిన గాయాలను చూసుకున్నాడు. ఇంత జరిగిన ఆ ఏనుగు మాత్రం అతడినికి ఎలాంటి హాని చేయకుండా అక్కడే నిల్చోని చూసింది. ఈ సంఘటన మొత్తాన్ని అక్కడే ఉన్న కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ ప్రవీణ్ కస్వాన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ… ఆ ఏనుగు ఏం ఆలోచిస్తోంది ? ఏవరైనా చెప్పగలరా ? అంటూ ట్విట్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోను 72,000 మంది వీక్షించారు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు తమ స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోపై మీరు ఓ లుక్కెయ్యండి..

ట్వీట్..

Also Read: నెటిజన్లపై మండిపడ్డ రేణు దేశాయ్.. పిచ్చి పిచ్చి మెసేజీలు ఆపండి.. మిగతవాళ్ళ ప్రాణాలు పోతున్నాయ్ అంటూ ఫైర్..

మనుషులకు పోటీ ఇస్తున్న కోతి.. ఈ మంకీ చేసే పనికి నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్..