Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Grand Mother: బామ్మగారు..బంతాట..అదరగొట్టేశారు సుమండీ! మీరూ చూస్తే..వారెవ్వా బామ్మా అంటారు గ్యారెంటీగా..Viral Video

Grand Mother: అప్పుడప్పుడు కొన్ని విషయాలు ఠక్కున మన మనసును పట్టేసుకుంటాయి. మామూలుగా చూస్తే అదేమీ అంత పెద్ద విషయంలా కనిపించకపోవచ్చు.

Grand Mother: బామ్మగారు..బంతాట..అదరగొట్టేశారు సుమండీ! మీరూ చూస్తే..వారెవ్వా బామ్మా అంటారు గ్యారెంటీగా..Viral Video
Grand Mother
Follow us
KVD Varma

|

Updated on: May 18, 2021 | 12:08 PM

Grand Mother: అప్పుడప్పుడు కొన్ని విషయాలు ఠక్కున మన మనసును పట్టేసుకుంటాయి. మామూలుగా చూస్తే అదేమీ అంత పెద్ద విషయంలా కనిపించకపోవచ్చు. కానీ, మనం ఉన్న ప్రస్తుత పరిస్థితిలో మనసుకు ఉల్లాసాన్నిచ్చేలా ఏది కనిపించినా సరదాగా అనిపిస్తుంది. అందులోనూ కొన్నిసార్లు సోషల్ మీడియాలో వచ్చే కొన్ని వీడియోలు మనల్ని విపరీతంగా కట్టిపాడేస్తాయి. అది పెద్ద వీడియో కానక్కర్లేదు.. దానిలో వింతలో విడ్డూరాలు ఏమీ ఉండక్కరలేదు. కానీ, చక్కని ప్రేరణ కలిగించేలా కనిపిస్తే మనసు ఒక్కసారిగా ఉల్లాసంగా అయిపోతుంది. ఇప్పుడు మీకు అటువంటి చిన్న వీడియో ఒకటి పరిచయం చేయబోతున్నాము. నిజంగానే చిన్న వీడియో ఇది. ట్విట్టర్ లో వచ్చింది. కానీ, చూస్తే మాత్రం భలే అనిపిస్తుంది. ఆ వీడియోలో ఓ బామ్మ ఉంది. ఆమె బౌలింగ్ ఆడుతోంది.. బౌలింగ్ తెలుసుగా.. సింపుల్ గా చెప్పాలంటే.. బాల్ తో పిన్ లను పడగొట్టే ఆట. ఆ ఆట ఆడుతోంది బామ్మ. బాల్ పట్టుకుంది.. వేసింది. అంతే.. మొత్తం పిన్ లన్నీ ఒక్క దెబ్బకు కింద పడిపోయాయి. సూపర్ కదూ. ఇంతకంటే సూపర్ ఇంకొంటి ఎమిటంటే.. పిన్స్ అన్నీ పడిపోయాకా ఆ బామ్మ వెనక్కి తిరుగుతూ విజయం సాధించిన ఆనందాన్ని కళ్ళతోనే వెలుబుచ్చి తన ఫేస్ మాస్క్ సరిచేసుకుంది. అప్పడు ఇంకా సూపర్ అనిపిస్తుంది. ఇది జస్ట్ 15 సెకన్ల వీడియో. కానీ, బామ్మ బాల్ విసరడం.. పిన్ లన్నీ పడిపోవడం.. ఆమె వెనక్కితిరుగుతూ మాస్క్ సర్దుకోవడం.. నిజంగా మనసును హత్తుకుంటాయి. ఈ వీడియో ఇక్కడ మీరూ చూడొచ్చు..

ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిని ఆ బామ్మ మనవడు సుదర్శన్ కృష్ణమూర్తి మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్‌లో షేర్ చేశారు. రెండు లక్షల మంది ఈ వీడియో ఇప్పటివరకూ చూశారు. ఈ వీడియో వైరల్ కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఈ వీడియో చూసిన అందరూ ఆమె బౌలింగ్ కి పడిపోయారు. చాలా మంది కామెంట్లు పెట్టారు. ఈ వీడియోను షేర్ చేశారు.

Also Read: Viral Video: 20వ అంతస్తు పైనుంచి కిందపడి తాబేలు మృతి… యజమాని పై కేసు నమోదు… ( వీడియో )

గుజరాత్‌లో దారుణ ఘటన.. టిక్‌టాక్‌ వీడియోలు చేస్తూ బాలుడు మృతి..వైరల్ గా మారిన బాలుడి వీడియో .:viral video.