ముంబైలో 953 కోవిడ్ కేసుల నమోదు, మొదటిసారిగా అతి తక్కువన్న ప్రభుత్వం, ఊపిరి పీల్చుకున్న ఉద్ధవ్ థాక్రే సర్కార్
ముంబైలో గత 24 గంటల్లో 953 కోవిడ్ కేసులు మాత్రం నమోదైనట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మార్చి 2 తరువాత ఇంత తక్కువగా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.ప్రమాదకరమైన సెకండ్ కోవిడ్ వేవ్ తో మహారాష్ట్ర తల్లడిల్లిపోయింది...
ముంబైలో గత 24 గంటల్లో 953 కోవిడ్ కేసులు మాత్రం నమోదైనట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మార్చి 2 తరువాత ఇంత తక్కువగా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.ప్రమాదకరమైన సెకండ్ కోవిడ్ వేవ్ తో మహారాష్ట్ర తల్లడిల్లిపోయింది.ఇటీవల వరుసగా సుమారు 60 వేల వరకు కూడా కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. కాగా ముఖ్యంగా ముంబై సిటీ ఈ కోవిద్ నుంచి మెల్లగా కోలుకుంటున్నట్టు కనిపిస్తోంది. గత 24 గంటల్లో 44 మంది కోవిద్ రోగులు మరణించారు. పాజిటివిటీ రేటు 5.31 శాతమని అధికారులు స్పష్టం చేశారు.రికవరీ రేటు ప్రస్తుతం 93 శాతం ఉన్నట్టు వారు పేర్కొన్నారు. గత నెలలో సుమారు రోజుకు 50 వేల టెస్టింగులు నిర్వహించగా ఇప్పుడు 20 వేలు, 25 వేలకు మించి వీటిని నిర్వహించడంలేదు. ఈ నెల 16 న ఇది మరింతగా తగ్గి 17,640 టెస్టింగులు చేశారని ముంబై మున్సిపల్ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు కోవిద్ మహమ్మారితో సతమతమైన మహారాష్ట్ర ప్రస్తుతం తౌఫ్తే తుఫాను వల్ల కలిగిన నష్టాలను అంచనా వేయడంలో నిమగ్నమైంది. ప్రధాని మోదీ ..సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో ఫోన్ లో మాట్లాడి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ :రోడ్డు మధ్యలో ఏనుగు.. అప్పుడే బైక్ పై వచ్చిన యువకుడు.. అంతలోనే ఊహించని ఘటన.. చివరకు..