Mamata Banerjee: బెంగాల్‌లో సుపరిపాలన అందించాలంటే.. గవర్నర్‌ను మార్చండి.. రాష్ట్రపతి, ప్రధానికి మమతా లేఖ..

Bengal governor Jagdeep Dhankhar: పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గవర్నర్ జగదీప్ ధన్కర్ మధ్య వార్ మళ్లీ మొదలైంది. బెంగాల్ రాష్ట్రంలో సుపరిపాలన కోసం గవర్నర్‌ను వెంట‌నే

Mamata Banerjee: బెంగాల్‌లో సుపరిపాలన అందించాలంటే.. గవర్నర్‌ను మార్చండి.. రాష్ట్రపతి, ప్రధానికి మమతా లేఖ..
Mamata Banerjee Jagdeep Dhankhar
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 18, 2021 | 11:06 PM

Bengal governor Jagdeep Dhankhar: పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గవర్నర్ జగదీప్ ధన్కర్ మధ్య వార్ మళ్లీ మొదలైంది. బెంగాల్ రాష్ట్రంలో సుపరిపాలన కోసం గవర్నర్‌ను వెంట‌నే మార్చాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేర‌కు మమతా మంగ‌ళ‌వారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్‌, ప్రధానమంత్రి న‌రేంద్రమోదీకి లేఖ రాశారు. నారద కుంభకోణంలో ఇద్దరు మంత్రులు, మాజీ మంత్రి, మాజీ మేయర్‌తో పాటు నలుగురు తృణమూల్ నాయకులను సీబీఐ సోమవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వెంటనే మ‌మ‌త లేఖ రాశారు. ఇటీవ‌ల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అనంతరం గవర్నర్ జగదీప్ ధంఖర్.. మమతా బెన‌ర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో శాంతి, భ‌ద్ర‌త‌ల‌ను అదుపులో ఉంచ‌క‌పోతే తీవ్ర చ‌ర్య‌లు తప్ప‌వంటూ మ‌మ‌త‌ను టడేు హెచ్చ‌రించారు. రాష్ట్రంలో పరిస్థితి ఇప్పుడు పూర్తి నియంత్రణలో ఉందని.. శాంతి భద్రతలు కూడా అదపులో ఉన్నాయని మమతా తెలిపారు. ప్రస్తుతం అధికారులు క‌రోనా నియంత్రణ చర్యల్లో బిజీగా ఉన్నారని మమతా లేఖ‌లో తెలిపారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమ సమయంలో జరిగిన అల్లర్లు, పలు అంశాలపై ట్వీట్ చేయడం ద్వారా ధంఖర్ అన్ని పరిమితులను దాటుతున్నారని ఆరోపించారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌భుత్వ ప‌నితీరును అస్థిర‌ప‌రిచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, రాష్ట్రంలో సుప‌రిపాల‌న అందించాలంటే వెంట‌నే గ‌వ‌ర్న‌ర్‌ను మార్చాల‌ంటూ మ‌మ‌తా బెన‌ర్జీ త‌న లేఖ‌లో కోరారు. ఇదిలాఉంటే.. గవర్నర్‌ను తొలగించాలని కోరుతూ శాసనసభ తీర్మానాన్ని ఆమోదించడం గురించి కూడా పార్టీ పరిశీలిస్తున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు వెల్లడించారు. కాగా అంతకుముందు నుంచే ప్రభుత్వం, గవర్నర్ మధ్య విబేధాలు కొనసాగుతూ వస్తున్నాయి.

Also Read:

ముంబైలో 953 కోవిడ్ కేసుల నమోదు, మొదటిసారిగా అతి తక్కువన్న ప్రభుత్వం, ఊపిరి పీల్చుకున్న ఉద్ధవ్ థాక్రే సర్కార్

సింగపూర్ లో 12-15 ఏళ్ళ మధ్య వయస్కులకు వ్యాక్సినేషన్, యుధ్ధ ప్రాతిపదికన చేపడతామన్న ప్రభుత్వం, అమెరికా పంథాను అనుసరిస్తున్న నిపుణులు