సింగపూర్ లో 12-15 ఏళ్ళ మధ్య వయస్కులకు వ్యాక్సినేషన్, యుధ్ధ ప్రాతిపదికన చేపడతామన్న ప్రభుత్వం, అమెరికా పంథాను అనుసరిస్తున్న నిపుణులు

కోవిడ్ కేసులు పెరిగిన దృష్ట్యా సింగపూర్ లో 12-15 ఏళ్ళ వయస్సువారికి యుధ్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా స్కూళ్ళు, కాలేజీ విద్యార్థుల్లో కోవిద్ కేసులు పెరిగినందున ఈ చర్య చేపడుతున్నామని...

సింగపూర్ లో 12-15 ఏళ్ళ మధ్య వయస్కులకు వ్యాక్సినేషన్, యుధ్ధ ప్రాతిపదికన చేపడతామన్న ప్రభుత్వం, అమెరికా పంథాను అనుసరిస్తున్న నిపుణులు
Singapoor
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: May 18, 2021 | 10:47 PM

కోవిడ్ కేసులు పెరిగిన దృష్ట్యా సింగపూర్ లో 12-15 ఏళ్ళ వయస్సువారికి యుధ్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా స్కూళ్ళు, కాలేజీ విద్యార్థుల్లో కోవిద్ కేసులు పెరిగినందున ఈ చర్య చేపడుతున్నామని ఈ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఆంగ్ యే కుంగ్ తెలిపారు. ఈ వయస్సువారికి ఫైజర్, బయో ఎన్ టెక్ వ్యాక్సిన్లు ఇస్తామని ఆయన చెప్పారు.నిజానికి ఈ టీకామందులను ఇటీవలివరకు 16 ఏళ్ళు, అంతకన్నా వయస్సు పైబడినవారికి ఇస్తూ వచ్చారు .కానీ అమెరికాలో 12-15 ఏళ్ళ మధ్యవయస్కులకు కూడా ఇవ్వాలన్న ప్రతిపాదనకు ఆ దేశ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో సింగపూర్ కూడా అదే పంథాను అనుసరిస్తోంది.కోవిడ్ 19 పై గల మల్టీ మినిస్ట్రీ టాస్క్ ఫోర్స్ కి ఆంగ్ చైర్మన్ కూడా.. ఫైజర్, బయో ఎన్ టెక్ టీకామందులు సురక్షితమైనవని నిపుణుల కమిటీలు తేల్చాయని ఆయన చెప్పారు. సింగపూర్ లో గత ఏడాది కన్నా ఈ సారి ఎక్కువమంది పిల్లలు కరోనా వైరస్ లక్షణాలకు గురయ్యారని కెన్నెత్ మాక్ అనే రీసెర్చర్ చెప్పారు.

సింగపూర్ లో మంగళవారం నుంచి ఈ నెల 28 వరకు స్కూళ్ళు, కాలేజీలను మూసివేశారు.ఒఇలా ఉండగా సింగపూర్ నుంచి విమానాలను రద్దు చేయాలని, అలాగే ఇండియా నుంచి ఆ దేశానికి విమాన సర్వీసులను ప్రస్తుతానికి క్యాన్సిల్ చేయాలనీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అప్పుడే డిమాండ్ చేశారు. సింగపూర్ వేరియంట్ ఇండియాలోని పిల్లలకు కూడా సోకవచ్చునని, అది థర్డ్ వేవ్ కి దారి తీసే ప్రమాదం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

మరిన్ని చదవండి ఇక్కడ :రోడ్డు మధ్యలో ఏనుగు.. అప్పుడే బైక్ పై వచ్చిన యువకుడు.. అంతలోనే ఊహించని ఘటన.. చివరకు..

Grand Mother: బామ్మగారు..బంతాట..అదరగొట్టేశారు సుమండీ! మీరూ చూస్తే..వారెవ్వా బామ్మా అంటారు గ్యారెంటీగా..Viral Video