Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China Population: తగ్గిపోతున్న జనాభా వృద్ధిరేటు… ఇద్దరు పిల్లల పరిమితిని ఎత్తేసే యోచనలో చైనా!

దేశ జనాభా క్రమంగా తగ్గిపోతున్నట్లు ఇటీవల నిర్వహించిన జనగణనలో తేలడంతో చైనా ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఇద్దరు పిల్లలు వద్దు.. ఎక్కువ పిల్లలు ముద్దన్న నినాదాన్ని ఎత్తుకోనుంది డ్రాగన్ కంట్రీ.

China Population: తగ్గిపోతున్న జనాభా వృద్ధిరేటు... ఇద్దరు పిల్లల పరిమితిని ఎత్తేసే యోచనలో చైనా!
China Census
Follow us
Janardhan Veluru

|

Updated on: May 18, 2021 | 7:16 PM

దేశ జనాభా క్రమంగా తగ్గిపోతున్నట్లు ఇటీవల నిర్వహించిన జనగణనలో తేలడంతో చైనా ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఇద్దరు పిల్లలు వద్దు.. ఎక్కువ పిల్లలు ముద్దన్న నినాదాన్ని ఎత్తుకోనుంది డ్రాగన్ కంట్రీ. నష్ట నివారణ చర్యల్లో భాగంగా బర్త్ పాలసీలో సంస్కరణలు తెచ్చే యోచనలో ఉంది. ఆ మేరకు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సంసిద్దమని ప్రకటించింది.

ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా చైనాకు గుర్తింపుంది. 2020 జనాభా లెక్కల ప్రకారం ఆ దేశ జనాభా పెరుగుదల రేటు తగ్గింది. గత 10 ఏళ్లలో సగటు వార్షిక జనాభా వృద్ధి రేటు 0.53% మాత్రమే కావడం ఆ దేశాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. అంతకు ముందు 2000-2010లో నమోదైన సగటు వార్షిక జనాభా వృద్ధి రేటు 0.57% గా ఉంది. దానితో పోలిస్తే.. 2020 నాటికి 0.04 శాతం మేర సగటు వృద్ధి రేటు తగ్గింది.  ప్రస్తుతం చైనా జనాభా 1.41 బిలియన్లు (141 కోట్లు) గా ఉంది.

జనాభా వృద్ధి రేటు తగ్గుదలపై చైనా ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. దీంతో సామాజిక సమతుల్యతకు భంగం కలుగుగుతుందన్న నిఫుణుల అభిప్రాయంతో  ప్రభుత్వం ఏకీభవించింది. 1979లో జనాభా పెరుగుదలను తగ్గించేందుకు ‘వన్ చైల్డ్’ (ఒకే బిడ్డ) విధానాన్ని అమలు చేసింది చైనా. జనాభాలో వృద్ధుల శాతం పెరుగటంతో.. 2015లో వన్ చైల్డ్ విధానానికి స్వస్తి చెప్పింది. ఇద్దరు పిల్లలను కనేందుకు జంటలకు అనుమతిచ్చింది. అయినప్పటికీ.. ‘తగ్గుతున్న జనన రేటుకు’ కళ్లెం వేయడంలో విఫలం చెందింది. 2020 జనాభా లెక్కల్లో ఒక మహిళ సంతాన సాఫల్యత రేటు 1.3 మాత్రమే. తాజా లెక్కల్లో జనాభా వృద్ధి రేటు తగ్గగా… వృద్ధుల సంఖ్య క్రమంగా పెరగడం డ్రాగన్ దేశానికి ఏమాత్రం రుచించే అంశంకాదు.

దిద్దుబాటు దిశలో చైనా నేతలు.. జనాభా తగ్గుదలతో ఏర్పడే సవాళ్లను ఎదుర్కొనేందుకు చైనా నేతలు, అధికారులు సన్నద్ధమవుతున్నారు. జననాలపై ఇప్పటికే ఉన్న నిబంధనలను ఎత్తివేయకుండానే ఎక్కువ మంది పిల్లలను కనాలని ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టనున్నారు.. ఎక్కువమంది పిల్లలతో దంపతులపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు చైనా ప్రభుత్వం ప్రణాళికబద్ధమైన చర్యలు చేపట్టనుంది. శ్రామిక శక్తి తగ్గుదల రేటును నియంత్రించడానికి రిటైర్మెంట్ వయసు పెంచే యోచనలో చైనా ప్రభుత్వముంది. రిటైర్మెంట్ వయసు పెంచడవల్ల నిధుల లేమితో ఉన్న పింఛను వ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతమున్న బర్త్ పాలసీనే కొనసాగిస్తూ.. దంపతులను ఎక్కువమంది సంతానం కనేటట్టు ప్రోత్సహించాలని భావిస్తోంది. జననాలపై ఉన్న నిబంధనలను వచ్చే 3- 5 ఏళ్లలో పూర్తిగా ఎత్తివేయాలని భావిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

అయితే ఇప్పటికిప్పుడు ఇద్దరు పిల్లల పరిమితిని ఎత్తేస్తే.. అవాంఛనీయ ఫలితాలు ఎదురవుతాయని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇద్దరు పిల్లల పరిమితిని ఎత్తేస్తే.. కలిగే ప్రభావాలపై అధికారుల విశ్లేషిస్తున్నారు. ఈ పరిమితి ఎత్తేస్తే.. నగరాల్లోని ప్రజలపై అంతగా ప్రభావముండదు. ఎందుకంటే ఆర్థిక భారం మూలంగా వారు ఎక్కువ మంది సంతానాన్ని వద్దనుకుంటున్నారు. అయితే గ్రామీణ జనాభాపై ప్రభావం ఎక్కువే ఉండే అవకాశముంది. ఫలితంగా గ్రామాల్లో జనాభా వేగంగా పెరుగుతుంది. దాంతోపాటు పేదరికం, నిరుద్యోగం కూడా పెరిగి ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి ఏర్పడే అవకాశముంది. జననాలు తగ్గి.. వృద్ధుల జనాభా పెరుగుతున్నప్పటికీ.. పట్టణాల్లో ఏటా కోటి ఉద్యోగాలను కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది చైనా. ప్రస్తుతం చైనా ముందున్న ప్రధాన సవాల్ పెరుగుతున్న వృద్ధుల జనాభానే.

ఈ నేపథ్యంలో తగ్గుతున్న జననాల సమస్యను ఎదుర్కొనడానికి సమగ్రమైన విధానం రూపొందించాల్సిన ఆవశ్యకత ఉందని చైనా నిఫుణులు అభిప్రాయపడుతున్నారు. జననాలను పెంచడానికి పూర్తిస్థాయిలో ప్రభుత్వం నిబంధనలను సరళీకరించి ప్రజలను ప్రోత్సహించాలని పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా(పీబీఓసీ ) పేర్కొంది. గత 20 ఏళ్లలో చైనా చవిచూసిన నష్టాలను నుంచి పాఠాలు నేర్చుకోవాలని పీబీఓసీ సూచించంది.

చైనాలో 65 ఏళ్లు పైబడ్డ వృద్ధులు శాతం.. 2010లో.. 8.7 శాతం 2020లో.. 13.5 శాతం

ఇవి కూడా చదవండి…Plasma Therapy: ఇక ప్లాస్మా థెరపీకి గుడ్‌బై… ప్రభుత్వ నిర్ణయం వెనుక కారణాలివేనా?

రోడ్డు మధ్యలో ఏనుగు.. అప్పుడే బైక్ పై వచ్చిన యువకుడు.. అంతలోనే ఊహించని ఘటన.. చివరకు..