America: ప్రపంచ దేశాలకు అమెరికా భారీ సాయం.. కీలక ప్రకటన చేసిన అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్
America: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్‌లో పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదవుతున్నాయి. ఇక ప్రపంచ..
America: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్‌లో పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదవుతున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ భారీగా కొనసాగుతోంది. ఈ నేపథ్యం ప్రపంచ దేశాలకు 8 కోట్ల టీకాలను అందించనున్నట్లు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలను వచ్చే ఆరు వారాల్లో ప్రపంచ దేశాలకు అందించనున్నట్లు పేర్కొన్నారు. అమెరికాలో ఉత్పత్తి అయ్యే టీకాలలో ఈ మొత్తం 13 శాతం కాగా, ఇప్పటి వరకు రష్యా, చైనా ప్రపంచ దేశాలకు సరఫరా చేసినదానికంటే 5 రెట్లు ఎక్కువ అని బైడెన్ తెలిపారు.
ప్రపంచమంతా కరోనా మమహ్మారితో ఇబ్బందులకు గురవుతుంటే అమెరికా సురక్షితంగా ఉండలేదని బైడెన్ అన్నారు. అమెరికాలో ప్రస్తుతం ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లు వినియోగిస్తున్నారు. కాగా, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో భారత్‌కు ఎల్లవేళలా అండగా ఉంటామని మరోసారి హామీ ఇచ్చారు బైడెన్. భారత్‌కు అన్ని విధాలా సాయం అందిస్తామని శ్వేతసౌధం ప్రకటించింది. కోవిడ్‌పై పోరులో భాగంగా భారత్‌కు అమెరికా ఇప్పటికే 100 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సహాయ సహకారాలను అధ్యక్షుడు బైడెన్ దగ్గరుండి చూసుకుంటున్నారని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి జెన్ సాకీ వెల్లడించారు.
ఇవీ చదవండి:
Corona Vaccination Update: కరోనా నుంచి కోలుకున్నవారికి 9 నెలల తర్వాత వ్యాక్సిన్.. !