గ్రాడ్యుయేషన్ పట్టా పొందిన సవతి కూతురికి అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అభినందన, ఉన్నతాశయాలే నీ లక్యం కావాలని సూచన
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తన సవతి కూతురు ఎల్లా హాఫ్ ను అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మనస్ఫూర్తిగా అభినందించారు. తామిద్దరూ కలిసి ఉన్న ఫోటోను...
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తన సవతి కూతురు ఎల్లా హాఫ్ ను అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మనస్ఫూర్తిగా అభినందించారు. తామిద్దరూ కలిసి ఉన్న ఫోటోను ఆమె షేర్ చేస్తూ నీ గ్రాడ్యుయేషన్ పూర్తి అయినందుకు కంగ్రాట్స్ చెబుతున్నానని, మంచి ఉదాత్త ఆశయాలతో ముందుకు వెళ్తావని ఆశిస్తున్నానని అన్నారు. ఉన్నతాశయాలే నీ లక్ష్యం కావాలని, నువ్వు సాధించలేనిది అంటూ ఏదీ ఉండదని పేర్కొన్నారు. హారిస్ భర్త డగ్లస్ ఎమ్ హాఫ్ కూడా తన కూతురి ‘విజయం’ పట్ల ఆమెను అభినందించారు. భవిష్యత్తులో నువ్వు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తావన్న నమ్మకం తనకు ఉందన్నారు. నీకు నా మనఃపూర్వక అభినందనలు అని ఆయన అన్నారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన జోబైడెన్, కమలా హారిస్ ల ప్రమాణ స్వీకారానికి ఎల్లా హాఫ్ హాజరైంది. పిల్లి చర్మంతో తయారు చేసిన కోటు ధరించి ఆమె అందర్నీ ఆకర్షించింది. ఫ్యాషన్ క్రిటిక్స్ కూడా ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. ఐఎంజీ మోడల్స్ తరఫున ఎల్లా పని చేసింది. ఓ మ్యాగజైన్ ముఖ చిత్రం మీద మొదటిసారిగా ‘అప్పియర్’ అయి అప్పటికే సంపాదించుకున్న తన అభిమానులకు ఆమె చేరువైంది. తన కుటుంబీకుల్లో ఎవరు ఏ ఘనత సాధించినా కమలా హారిస్ ఉప్పొంగిపోతుంటారు. ఇప్పుడు కూడా తన సవతి కూతురిని ఆమె ఇలా అభినందించారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Shekar Master: డ్యాన్సర్‌లందరికీ నేనున్నా… ఉపాధి కోల్పోయిన వారికి ఉచితంగా… ( వీడియో )
Viral Video: ఆకాశం నుంచి ఎలుకల వర్షం వట్టి భ్రమేనా..?? అసలు విషయమేమిటంటే… ( వీడియో )