Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆపరేషన్ ముస్కాన్’ మళ్లీ వేగవంతం.. డీజీపీ గౌతమ్ సవాంగ్ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో ఆపరేషన్ ముస్కాన్‌ను మళ్లీ వేగవంతం చేశారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ఆపరేషన్ ముస్కాన్‌ను చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఆపరేషన్ ముస్కాన్‌ను మళ్లీ వేగవంతం చేశారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ఆపరేషన్ ముస్కాన్‌ను చేపట్టారు. పోలీసులు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు, హోటళ్లు, దాబాలు, ఇటుక బట్టీలు, ఆటో గ్యారేజ్‌లను పోలీసులు జల్లెడ పడుతున్నారు. కరోనా కట్టడిలో భాగంగా ఏపీ ప్రభుత్వం వీధి బాలల కోసం ‘ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్ 19’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ శాఖల సమన్వయంతో పోలీస్ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీని ద్వారా తప్పిపోయిన బాలబాలికలు, బాల కార్మికులు, అనాథ పిల్లలను గుర్తించి.. వారిని తల్లిదండ్రుల వద్దకు, అనాథలను పునరావాస కేంద్రాలకు తరలిస్తారు.
రాష్ట్రంలోని జన సంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండులలో ఈ ‘ఆపరేషన్ ముస్కాన్’ కొనసాగుతోంది. బాల కార్మికులు, 14 సంవత్సరం లోపు వీధి బాలలకు విముక్తి కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఐసిడిఎస్, ఎన్జీఓలు ,వివిధ శాఖల సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.