Marble Temple: ఏపీలోనూ బిర్లామందిర్ను తలపించే పాలరాతి ఆలయం.. 14 ఏళ్లపాటూ ఆలయ నిర్మాణం
పాలరాయితో నిర్మించిన దేవాలయం అనగానే గుర్తుకువచ్చేది తెలంగాణ రాష్ట్రంలోని బిర్లా మందిర్. బిర్లా మందిర్ ఆలయాన్ని స్వచ్ఛమైన పాల రాయితో నిర్మాణం చేశారు. బిర్లా మందిర్ ఆలయాన్ని తలపించేలా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో జైను మతస్తులు మొట్టమొదటి శ్రీ సాంబు నాథ్ జీ పాల రాయి ఆలయాన్ని నిర్మించారు.

సర్వ శ్రేష్ఠ హిందుత్వాన్ని కాపాడుతూ జైను మత సిద్ధాంతాలను దేశంలోని వివిధ ప్రాంతాలలో విస్తరింప చేస్తూన్నారు. విజయవాడ నగరంలోని పశ్చిమ నియోజకవర్గ ప్రాంతంలో జైను మత ప్రజలు ఆరాధించే 24 తితంగల్ దేవులల్లో ప్రథముడు శ్రీ సాంబు నాథ్ ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. 1998 సంవత్సరంలో గురు గారు శ్రీ మత్ రాజేంద్ర సూరి మహారాజ్ చేతుల మీదుగా ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. దాదాపు 14 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రంలోని బిర్లా మందిర్ తలపించేలా 1000 గజాలో ఒక ఇనుము, నాప రాయి వంటివి లేకుండా స్వచ్ఛమైన పాల రాయితో ఆలయ నిర్మాణానికి కృషి చేశారు.
శ్రీ సాంబు నాథ్ దేవాలయాన్ని దర్శించిన భక్తులకు కోరిన కోర్కెలు తిరుతాయని ప్రజల నమ్మకం. ప్రతి సంవత్సరం జైను మత పండుగలు అయిన పర్వ ప్రదర్శన్, కార్తీక మాసం, దీపావళి, గురు సప్తమి వంటి పర్వదినాలను పురస్కరించుకొని శ్రీ సాంబు నాథ్ స్వామికి బంగారు వజ్ర ఆభరణాల అలంకరిస్తారు. శ్రీ సాంబు నాథ్ ఆలయంలో అర్చకులతో పని లేకుండా జైను మతస్తులు స్వయంగా స్వామివారికి పూజలు నిర్వహిస్తారు. జైను మత పర్వదినాలలో ఉపవాస దీక్షను అచరిస్తూ వారి భక్తితో స్వామివారిని ప్రసన్నం చేసుకుంటారు. శ్రీ సాంబు నాథ్ ఆలయాన్ని దర్శించటానికి వచ్చే భక్తులు టీటీడీ వలె హిందువుల సంప్రదాయ దుస్తులు ధరిస్తారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..