Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: మన్యం జిల్లాలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర.. గిరిజన వ్యవసాయ ఉత్పత్తులకు ఫీదా

మన్యం జిల్లాలోని గిరిజన ప్రాoతం అయిన సీతంపేట అంటే ప్రకృతి అందాలకే కాదు గిరిజన వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ఫేమస్. పోడు వ్యవసాయం ద్వారా ఆర్గానిక్ విధానంలో కొండలపై చేసే వ్యవసాయ సాగు ఇక్కడ ఓ ప్రత్యేకం. ఇక్కడ పండించే  అనాస , పసుపు, అరటి, పనస, జీడీ , పెండ్లాం, కందులు, మినుములు, చిరు ధాన్యాలు వంటి అనేక గిరిజన ఉత్పత్తులుకు భలే క్రేజ్ ఉంటుంది. రుచితో పాటు ఆరోగ్యానికి సీతంపేట గిరిజన వ్యవసాయ ఉత్పత్తులు భరోసాగా ఉంటాయి.

Andhra Pradesh: మన్యం జిల్లాలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర.. గిరిజన వ్యవసాయ ఉత్పత్తులకు ఫీదా
Nara Bhuvaneswari
Follow us
S Srinivasa Rao

| Edited By: Surya Kala

Updated on: Jan 07, 2024 | 12:53 PM

పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి జిల్లాలోని గిరిజన వ్యవసాయ ఉత్పత్తులకు ఫిదా అయ్యారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా గురువారం జిల్లా లోని పాలకొండ నియోజకవర్గం భామిని మండలం బిల్లమడలో మృతుడు బర్రి విశ్వనాథం కుటుంబాన్ని కలిసేందుకు వెళుతున్న భువనేశ్వరీకి ఏజెన్సీ ప్రాంతమైన సీతంపేటలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం ఇచ్చారు. ఈ సందర్భంగా పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ నిమ్మక జయకృష్ణ అధ్వర్యంలో ఆమెను కలిసిన పలువురు గిరిజన నాయకులు ఆమెకు ఓ బహుమానాన్ని అందజేశారు. తమ రెక్కల కష్టం పైనే ఆధారపడే గిరిజనులు వాటి ద్వారా సాగు చేసిన దుంప జాతికి చెందిన కూర పెండ్లం, అనాస పళ్లను ఆమెకు బహూకరించారు. వాటిని అందుకున్న భువనేశ్వరి ఆనందం వ్యక్తం చేయటమే కాదు అవి ఆర్గానిక్ విధానంలో సాగు చేసినవని తెలిసి మరింత ముచ్చట పడ్డారు.

ఆర్గానిక్ విధానంలో అనాస సాగుకు బెస్ట్ సీతంపేట గిరిజన ప్రాంతం

మన్యం జిల్లాలోని గిరిజన ప్రాoతం అయిన సీతంపేట అంటే ప్రకృతి అందాలకే కాదు గిరిజన వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ఫేమస్. పోడు వ్యవసాయం ద్వారా ఆర్గానిక్ విధానంలో కొండలపై చేసే వ్యవసాయ సాగు ఇక్కడ ఓ ప్రత్యేకం. ఇక్కడ పండించే  అనాస , పసుపు, అరటి, పనస, జీడీ , పెండ్లాం, కందులు, మినుములు, చిరు ధాన్యాలు వంటి అనేక గిరిజన ఉత్పత్తులుకు భలే క్రేజ్ ఉంటుంది. రుచితో పాటు ఆరోగ్యానికి సీతంపేట గిరిజన వ్యవసాయ ఉత్పత్తులు భరోసాగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఏ సీజన్ కి తగ్గట్టు ఆ సీజన్ లో పండే ఇక్కడి వ్యవసాయ ఉత్పత్తులు ఇక్కడి గిరిజన సంతల్లో సందడి చేస్తాయి. దూర ప్రాంతాలకు సైతం ఎగుమతి అవుతూ ఉంటాయి. ముఖ్యంగా పైనాపిల్ సీజన్ లో ఆ పంట ఏపీ ఆర్థిక రాజధాని విశాఖతో పాటు చుట్టూ పక్కల మార్కెట్ల కు భారీగా ఎక్స్ పోర్టు అవుతూ ఉంటుంది. ఏపీ లో జిల్లాల పునర్విభజన సమయంలో గిరిజనుల జనాభాను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా.

మన్యం జిల్లాలోని ఒక్క పార్వతీపురం(SC)నియోజకవర్గం మినహా మిగిలిన సాలూరు, కురుపాం, పాలకొండ మూడు నియోజక వర్గాలు ST రిజర్వుడు స్థానాలే కావటం ఇక్కడ ఓ విశేషం. గిరిజనులు ఎక్కువుగా ఉన్న జిల్లా కావటంతో ఈ జిల్లాలో అటవీ సంపద ఎక్కువే. పోడు వ్యవసాయం ద్వారా కొండ ప్రాంతంలోని గిరిజనులు అనేక రకాల పంటలను పండిస్తుంటారు. ఇలాంటి ప్రత్యేకత ఉన్న గిరిజన ఉత్పత్తులు అంటే ఇష్టపడని వారు ఉండరు.

మరిన్ని ఆంధ్రపదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..