Software Employee: అప్పుల బాధతో సాఫ్ట్ వేర్ ఉద్యోగి బలి
అరవింద్ మృతి ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అరవింద్ సొంత గ్రామం పాలకొండ మండలం గోపాలపురం. అరవింద్ కు తల్లిదండ్రులు, ఒక సోదరి ఉన్నారు. తల్లిదండ్రులు అరవింద్ ను ఎంతో కష్టపడి చదివించారు. చిన్నతనం నుండి ఏది అడిగినా కాదు అనకుండా అడిగినవన్నీ ఇచ్చారు. చదువు పూర్తవ్వగాన ఓ మంచి కంపెనీ లో సాప్ట్ వేర్ ఉద్యోగం కూడా వచ్చింది. ఉద్యోగం వచ్చినప్పటి నుండి ఇంటి వద్దే..
అప్పుల ఊబిలో కూరుకుపోయి ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రాణాలు వదిలాడు. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం బొడ్లపాడు సమీపంలోని ఓ తోటలో గుర్తు తెలియని యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. శరీరభాగం సగం కాలి అక్కడిక్కడే మృతి చెందినట్లు గుర్తించారు స్థానికులు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డెడ్ బాడీ వద్ద ఉన్న ఆధారాలను పరిశీలించి మృతుడు సాప్ట్ వేర్ ఎంప్లాయ్ అరవింద్ గా గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అరవింద్ మరణ వార్త విన్న తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.
అరవింద్ మృతి ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అరవింద్ సొంత గ్రామం పాలకొండ మండలం గోపాలపురం. అరవింద్ కు తల్లిదండ్రులు, ఒక సోదరి ఉన్నారు. తల్లిదండ్రులు అరవింద్ ను ఎంతో కష్టపడి చదివించారు. చిన్నతనం నుండి ఏది అడిగినా కాదు అనకుండా అడిగినవన్నీ ఇచ్చారు. చదువు పూర్తవ్వగాన ఓ మంచి కంపెనీ లో సాప్ట్ వేర్ ఉద్యోగం కూడా వచ్చింది. ఉద్యోగం వచ్చినప్పటి నుండి ఇంటి వద్దే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇంటి వద్ద ఉండటంతో అందరితో సరదాగా గడుపుతూ, తల్లిదండ్రులకు కూడా అండగా ఉంటూ వారికి కావాల్సిన అవసరాలు తీరుస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే స్నేహితులు, బంధువుల వద్ద అప్పులు చేశాడు. మొదట కొద్దిపాటిగా చేసిన అప్పు తరువాత రోజుల్లో కొంచెం కొంచెంగా పెరుగుతూ చివరికి అప్పులు తీర్చలేని పరిస్థితి వచ్చింది.
అయితే ఇచ్చిన డబ్బులు కోసం స్నేహితులు, బంధువులు కూడా ఒత్తిడి చేస్తూ వచ్చారు. దీంతో మనస్థాపానికి గురై తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. ఈ క్రమంలో అరవింద్ కొద్ది సేపట్లో బయటకెళ్ళి వస్తానని చెప్పి ఇంటి నుండి బయటకి వెళ్లాడు. అలా వెళ్ళిన అరవింద్ ఎంతకీ తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురై సమీప ప్రాంతాల్లో వెదకటం ప్రారంభించారు. ఈ క్రమంలోనే వారికి పోలీసులు నుండి అరవింద్ మృతి చెందాడన్న పిడుగులాంటి వార్త వచ్చింది.
హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని అరవింద్ మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరు అయ్యారు తల్లిదండ్రులు. అయితే పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేసి అరవింధ్ ఆత్మహత్య చేసుకున్నాడనే నిర్ధారణకు వచ్చారు. అయితే అరవింద్ ఆత్మహత్య చేసుకున్నాడనే అంశం పై బంధువులు, గ్రామస్తులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు అరవింద్ ఎందుకోసం అప్పులు చేశాడు? అరవింద్ ఎవరి వద్ద అప్పులు చేశాడు? అప్పులు కోసం కనీసం తమతో అయినా చెప్పేవాడు కదా? అలా ఎప్పుడు చెప్పలేదు? అరవింద్ అప్పులు కోసం ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు అనేది కుటుంబసభ్యుల వాదన. పోలీసులు అభిప్రాయపడుతున్నట్లు అరవింద్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు.
అసలు రాత్రి సమయంలోనే ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? మృతికి అప్పుల భాధలే కారణమా? లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అని సమగ్ర దర్యాప్తు చేయాలని కోరుతున్నారు కుటుంబసభ్యులు. బాగా చదువుకొని ఎంతో ప్రయోజకుడు అయ్యాడని ఆనందపడ్డామని, ఇలా మధ్యలోనే తమను వదిలేసి అన్యాయం చేసి కన్నీటిని మిగిల్చాడని కన్నీటి పర్యంతం అవుతున్నారు తల్లిదండ్రులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి