Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: మున్సిపల్‌ కార్మికులతో ముగిసిన చర్చలు.. మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు

మున్సిపల్ కార్మికులతో ఏపీ ప్రభుత్వం చర్చలు ముగిశాయి. చర్చల అనంతరం అటు ప్రభుత్వం.. ఇటు కార్మిక సంఘాలు ఎవరి వాదన వారే వినిపించారు. కార్మికుల డిమాండ్లను అన్నింటినీ అంగీకరించామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. అటు కార్మిక సంఘాలు మాత్రం తమ డిమాండ్లను ప్రభుత్వం సంపూర్ణంగా అంగీకరించలేదని ట్విస్ట్ ఇచ్చారు.

Andhra Pradesh: మున్సిపల్‌ కార్మికులతో ముగిసిన చర్చలు.. మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు
Minister Botsa Satyanarayana
Follow us
Basha Shek

|

Updated on: Jan 06, 2024 | 9:50 PM

మున్సిపల్ కార్మికులతో ఏపీ ప్రభుత్వం చర్చలు ముగిశాయి. చర్చల అనంతరం అటు ప్రభుత్వం.. ఇటు కార్మిక సంఘాలు ఎవరి వాదన వారే వినిపించారు. కార్మికుల డిమాండ్లను అన్నింటినీ అంగీకరించామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. అటు కార్మిక సంఘాలు మాత్రం తమ డిమాండ్లను ప్రభుత్వం సంపూర్ణంగా అంగీకరించలేదని ట్విస్ట్ ఇచ్చారు. డిమాండ్ల సాధన కోసం 12 రోజులుగా మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే వారితో ప్రభుత్వం రెండు సార్లు చర్చలు జరిపింది ఇవాళ మరోసారి వారిని చర్చలకు పిలిచింది. డిమాండ్లను మంత్రులు, అధికారులు సావధానంగా విన్నారు. ప్రధానంగా జీతాల పెంపు, అలవెన్స్‌, బోనస్‌లపై కార్మికులు పట్టుబట్టారు. వీటిన్నింటికి అంగీకరించామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.అటు కార్మిక సంఘాలు మాత్రం తమ డిమాండ్లను విన్నారే తప్ప.. స్పష్టమైన హామీ ఇవ్వలేదన్నారు. రెండేళ్లుగా కాలయాపన చేసి.. ఇప్పుడు అంతంతమాత్రమే జీతాలు పెంచితే ఎలా అని ప్రశ్నించారు. చర్చలు ముగిశాయి. కానీ ఎవరి వాదన వారే వినిపించారు. ఫైనల్‌గా కార్మిక సంఘాలు మాత్రం సమ్మె విషయంలో వెనక్కి తగ్గేది లేదని క్లారిటీ ఇచ్చారు.

అంతకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్మికుల సమ్మె 12వ రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లను పరిష్కరించేవరకూ సమ్మె విరమించబోమని కార్మికులు స్పష్టం చేశారు. ప్రతి పట్టణ కేంద్రంలోనూ ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. నిరసనల్లో భాగంగా కడప నగరంలోని కార్పొరేషన్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు గుండు కొట్టించుకుని, పంగనామాలు పెట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..