Chandrababu Naidu: తిరువూరు ‘రా.. కదలిరా’ బహిరంగ సభలో చంద్రబాబు కీలక హామీలు..
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత రాజకీయంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. నాయకుల మొదలు కార్యకర్తల వరకు అందరిలో ఉత్సాహం నింపుతూ ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే రా.. కదలిరా పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ముందుగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో నిర్వహించిన ‘రా.. కదలి రా’ బహిరంగ సభకు చంద్రబాబుతో పాటు పలువురు పార్టీ ముఖ్యనేతలు, జిల్లా కో అర్డినేటర్లు, పార్టీ ఇన్ చార్జిలు పాల్గొన్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత రాజకీయంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. నాయకుల మొదలు కార్యకర్తల వరకు అందరిలో ఉత్సాహం నింపుతూ ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే రా.. కదలిరా పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ముందుగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో నిర్వహించిన ‘రా.. కదలి రా’ బహిరంగ సభకు చంద్రబాబుతో పాటు పలువురు పార్టీ ముఖ్యనేతలు, జిల్లా కో అర్డినేటర్లు, పార్టీ ఇన్ చార్జిలు పాల్గొన్నారు. అన్ని విధాలా నష్టపోయిన ఏపీని కాపాడుకునేందుకు ప్రజలందరూ కదలి రావాలని పిలుపునిచ్చారు.
ప్రపంచంలో తెలుగుజాతి నంబర్ వన్‌గా ఉండాలనేదే తన ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు. తెలుగు ప్రజలు ప్రపంచ రాజకీయాల్లో రాణించే పరిస్థితి వస్తుందని కితాబిచ్చారు. తెలుగుజాతి గ్లోబల్ నాయకులుగా ఎదిగేందుకు తెలుగుదేశం పార్టీ ఎంతగానో ఉపయోగపడిందని వివరించారు. రైతుల బ్రతుకులు మారాలంటే టీడీపీ-జనసేనల ప్రభుత్వం అధికారంలోకి రావాలని చెప్పారు. మరో మూడు నెలల్లో రైతు రాజ్యం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందన్నారు. మా రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకొనే రోజు వస్తుందని జోస్యం చెప్పారు. మీ భవిష్యత్తుకు నేను గ్యారంటీ ఇస్తా అని యువతను ఉద్ధేశించి అన్నారు.
రాష్ట్రంలోని యువతను ప్రపంచంలో నంబర్ వన్‌గా మారుస్తానని చెప్పారు. ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ’ అనే పేరుతో సూపర్ సిక్స్ పథకాలను అందిస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు రూ.3వేల భృతి ఇస్తామని తెలిపారు. ‘అన్నదాత’ పథకం తీసుకొచ్చి రైతులకు ప్రతి ఏటా రూ.20వేలు అందజేస్తామన్నారు. ‘జయహో బీసీ’ కింద ప్రత్యేక చట్టం తీసుకొస్తాం అని పేర్కొన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తెదేపా-జనసేన ఆధ్వర్యంలో త్వరలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




