రైతుల పంట పండింది.. గిరిగెట్లలో దొరికిన రెండు వ‌జ్రాలు! వాటి విలువ తెలిస్తే అవాక్కే..

తొలకరి జల్లులు పడ్డాయంటే చాలు కర్నూలు జిల్లాలోని పొలాల్లో వజ్రాల వేట మొదలవుతుంది. ముఖ్యంగా జొన్నగిరి,పగిడిరాయి,ఎర్రగుడి,మద్దికెర ప్రాంతాల్లోని ఎర్ర నేలల్లో వజ్రాల వేట ఎక్కువగా ఉంటుంది.

రైతుల పంట పండింది.. గిరిగెట్లలో దొరికిన రెండు వ‌జ్రాలు! వాటి విలువ తెలిస్తే అవాక్కే..
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 28, 2022 | 9:15 PM

తొలకరి జల్లులు పడ్డాయంటే చాలు కర్నూలు జిల్లాలోని పొలాల్లో వజ్రాల వేట మొదలవుతుంది. ముఖ్యంగా జొన్నగిరి,పగిడిరాయి,ఎర్రగుడి,మద్దికెర ప్రాంతాల్లోని ఎర్ర నేలల్లో వజ్రాల వేట ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సమేతంగా చాలామంది ఇక్కడి పొలాల్లో వజ్రాన్వేషణ కొనసాగిస్తారు. మంగళవారం వజ్రాల వేటకు వెళ్లిన రైతుకు రెండు వ‌జ్రాలు దొరికిన‌ట్టు తెలుస్తోంది. తుగ్గలి మండలంలోని గిరిగెట్లలో రైతులకు ఈ వ‌జ్రాలు దొరికిన‌ట్టు స‌మాచారం. పొలంలో ప‌నిచేస్తుంటే రైతులకు రెండు వజ్రాలు దొరికాయ‌ని, ఇందులో ఒక వజ్రాన్ని రూ 2.5 లక్షల నగదు, 2 తులాల బంగారానికి, మరో వజ్రాన్ని రూ. 15 వేలకు వజ్రాల వ్యాపారులు కొనుగోలు చేసినట్లు స‌మాచారం. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

గతంలోనూ ఇక్కడి పొలాల్లో చాలామందికి వజ్రాలు లభించాయి. ఇటీవల ఓ రైతుకు రూ.1కోటి పైచిలుకు విలువ చేసే వజ్రం దొరికింది. గత మే నెల 17వ తేదీన చిన్నజొన్నగిరి ప్రాంతానికి చెందిన ఓ మహిళకు 30 క్యారెట్ల వజ్రం దొరికింది. ఆ మరుసటిరోజే మరో మహిళకూ వజ్రం లభించింది.

ఇదిలా ఉంటే, రైతులకు దొరికిన వజ్రాలను స్థానిక వ్యాపారులు తక్కువ ధరకే వాటిని కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో రూ.కోట్ల విలువ చేసే వజ్రాలను ఇలా తక్కువ ధరకే కొనుగోలు చేసి అమాయకులను దోపిడీ చేస్తున్నారన్న విమర్శలున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి