AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు అందిస్తాం.. సమీక్షలో సీఎం జగన్ నిర్ణయం

విద్యాశాఖలో నాడు–నేడు, డిజిటల్‌ లెర్నింగ్‌, ఆరోగ్యశ్రీ పై సీఎం జగన్ (CM Jagan) సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి (Tadeapalli) లోని క్యాంపు కార్యాలయంలో సంబంధిత శాఖ అధికారులు చర్చించారు. సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వడంపై....

Andhra Pradesh: 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు అందిస్తాం.. సమీక్షలో సీఎం జగన్ నిర్ణయం
Ganesh Mudavath
|

Updated on: Jun 28, 2022 | 8:00 PM

Share

విద్యాశాఖలో నాడు–నేడు, డిజిటల్‌ లెర్నింగ్‌, ఆరోగ్యశ్రీ పై సీఎం జగన్ (CM Jagan) సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి (Tadeapalli) లోని క్యాంపు కార్యాలయంలో సంబంధిత శాఖ అధికారులు చర్చించారు. సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వడంపై చర్చలు జరిపారు .తరగతి గదుల్లో డిజిటల్‌ స్క్రీన్లు ఏర్పాటుపై కార్యాచరణ మొదలుపెట్టాలని ఆదేశించారు. బైజూస్‌తో ఒప్పందం దృష్ట్యా విద్యార్థులకు సంబంధిత కంటెంట్‌ అందించడంపై చర్చించారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఆరోగ్య శ్రీ లో పొరపాట్లు, అక్రమాలకు ఆస్కారం లేకుండా అర్హత కలిగిన వారందరికీ ప్రత్యేక ఖాతాలు తెరవాలని సూచించారు. ఈ ఖాతా నుంచే ఆటోమేటిక్‌గా వైద్యం అందించిన ఆసుపత్రికి నగదు బదిలీ చేయాలని పేర్కొన్నారు.

సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ ఇస్తాం. ట్యాబ్‌లో బైజూస్‌ కంటెంట్‌ను లోడ్‌ చేయాలి. దీనికి తగినట్టుగా ట్యాబ్‌ స్పెసిఫికేషన్స్, ఫీచర్లు ఉండాలి. టెండర్లు పిలిచేటప్పప్పుడు నాణ్యత, డ్యూరబులిటీని దృష్టిలో ఉంచుకోవాలి. 8వ తరగతిలో ఇచ్చే ట్యాబ్‌ అంటే 9, 10 తరగతుల్లో కూడా పనిచేయాలి. నిర్దేశిత సమయంలోగా ట్యాబ్‌లు పిల్లలకు అందేలా చర్యలు తీసుకోవాలి. తరగతి గదిలో డిజిటల్‌ బోర్డులు, టీవీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో ఉన్న 2,436 చికిత్సల సంఖ్య ఇంకా పెంచాలి. ప్రభుత్వ, బోధనాస్పత్రుల్లో ఖాళీల కొరత ఉండకూడదు. అవసరమైతే సిబ్బంది పదవీ విరమణ వయసు పెంచేందుకు ఆలోచించాలి. త్వరలో 176 పీహెచ్‌సీలు పూర్తి చేసి 2,072 పోస్టులు భర్తీ చేస్తాం.

              – సీఎం వైఎస్.జగన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!