రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఆగస్టు మాసంలో మరో 30 ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు

ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణీకులకు లబ్ధి చేకూర్చేలా ఆగస్టు మాసంలో పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే ప్రకటించింది.

రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఆగస్టు మాసంలో మరో 30 ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు
Indian Railways
Follow us
Janardhan Veluru

|

Updated on: Jul 27, 2022 | 5:10 PM

Railway News: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణీకులకు లబ్ధి చేకూర్చేలా ఆగస్టు మాసంలో పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ఇప్పటికే ప్రకటించింది. ఆగస్టు మాసంలో మరో 8 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ద.మ.రైల్వే ప్రకటించింది. అలాగే 22 ప్రత్యేక రైళ్లను ఆగస్టు మాసంలోనూ కొనసాగించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

నాందేడ్ – తిరుపతి వీక్లీ స్పెషల్ ట్రైన్ (నెం.07633) ఈ నెల 30న (శనివారం) మధ్యాహ్నం 12.00 గం.లకు నాందేడ్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.30 గం.లకు తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకోనుంది. అలాగే తిరుపతి – నాందేడ్ వీక్లీ స్పెషల్ ట్రైన్ (నెం.07634) ఈ నెల 31న (ఆదివారం) రాత్రి 09.10 గం.లకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 05.20 గం.లకు నాందేడ్ చేరుకుంటుంది.

ఇవి కూడా చదవండి

అలాగే తిరుపతి – ఔరంగాబాద్ వీక్లీ స్పెషల్ ట్రైన్ (నెం.07637) ఆగస్టు 7,14, 21 తేదీల్లో (ఆదివారం) ఉదయం 07.00 గం.లకు తిరుపతి నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.00 గం.లకు ఔరంగాబాద్ చేరుకుంటుంది. ఔరంగాబాద్ – తిరుపతి వీక్లీ స్పెషల్ ట్రైన్ (నెం.07638) ఆగస్టు 08,15,22 తేదీల్లో (సోమవారం) రాత్రి 11.05 గం.లకు ఔరంగాబాద్ నుండి బయలుదేరి బుధవారం వేకువజామున 03.00 గం.లకు తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.

ఇదిలా ఉండగా ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా.. మరో 22 వీక్లీ స్పెషల్ ట్రైన్స్‌ను ఆగస్టు మాసంలోనూ కొనసాగించనున్నట్లు ద.మ.రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్ – నరసాపూర్ – వికారాబాద్, హైదరాబాద్ – తిరుపతి – హైదరాబాద్ మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.

Railway News2

22 weekly special trains extended in aug 2022

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..