AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: మిస్సింగ్ సస్పెన్స్ వీడింది.. ఆమె చేసిన పనికి ప్రభుత్వానికి ఎంత ఖర్చైందో తెలిస్తే షాక్

ఆర్కే బీచ్‌ వద్ద 2 రోజుల క్రితం కనిపించకుండా పోయిన వివాహిత సాయి ప్రియ వ్యవహారంలో ఊహించని టర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. ఆమె ప్రియుడితో కలిసి ఎస్కేప్ అయినట్లు పోలీసులకు సమాచారం అందింది.

Vizag: మిస్సింగ్ సస్పెన్స్ వీడింది.. ఆమె చేసిన పనికి ప్రభుత్వానికి ఎంత ఖర్చైందో తెలిస్తే షాక్
Vizag Beach Missing Lady
Ram Naramaneni
|

Updated on: Jul 27, 2022 | 7:40 PM

Share

Andhra Pradesh: విశాఖ ఆర్కే బీచ్‌(RK Beach)లో వివాహిత మిస్సింగ్ సస్పెన్స్‌ వీడింది. ఫోన్ రావడంతో పక్కకు వెళ్లి మాట్లాడుతున్న భర్త కన్నుగప్పి ప్రియుడి రవితో కలిసి నెల్లూరుకు చెక్కేసినట్లు పోలీసులు గుర్తించారు. సాయిప్రియ.. ప్రియుడు రవితో కలిసి నెల్లూరు(Nellore)లో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. రెండ్రోజులపాటు రాష్ట్రప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టిన సాయిప్రియ మిస్సింగ్‌ కథ సుఖాంతమైంది. పెళ్లికి ముందే రవి అనే వ్యక్తితో ప్రేమవ్యవహారం నడిపిన సాయిప్రియ.. అదనుకోసం చూసింది. ఈ నెల 25న రెండో పెళ్లిరోజు కావడంతో భర్తకు మాయమాటలు చెప్పింది. సరదాగా బీచ్‌కు వెళ్దామంటూ నమ్మించింది. ప్రేమతో అడిగిన భార్య మాటను కాదనలేక.. పెళ్లి రోజుకూడా కావడంతో వెంటనే ఓకే చెప్పేశాడు భర్త. అప్పటికే ప్లాన్‌ చేసుకున్నారో ఏమో తెలియదు గానీ.. భర్త ఫోన్‌లో ఏమరుపాటుగా ఉండే క్షణం కోసం ఎదురుచూసింది. ఆ క్షణం రానేవచ్చింది. భర్తను ఏమార్చింది. ఎంచక్కా ప్రియుడితో కలిసి నెల్లూరు చెక్కేసింది. నెల్లూరులో ఉన్న సాయిప్రియను విశాఖకు తీసుకువస్తున్నట్లు చెబుతున్నారు విశాఖ డిప్యూటీ మేయర్‌ శ్రీధర్. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సాయి ప్రియ ప్రియుడితో కలిసి నెల్లూరు వెళ్లినట్లు సమాచారం. తాను బెంగళూరు ఉన్నట్లు సాయి ప్రియ తల్లిదండ్రులకు మెసేజ్ పంపింది. తాను ప్రియుడ్ని పెళ్లాడనని.. తన గురించి వెతకవద్దని.. ఆమె సందేశం పంపినట్లు తెలుస్తోంది.

గాలింపునకు ఎంత ఖర్చైందో తెల్సా..?

సాయిప్రియ సముద్రంలో కొట్టుకుపోయిందని ఆమె భర్త తెలిపిన వెంటనే స్థానిక పోలీసులు, అధికారులు అలెర్ట్ అయ్యారు. ఆమె ఆచూకి కోసం స్పెషల్ టీమ్స్‌ను రంగంలోకి దించారు.  స్పీడ్‌ బోట్లతో పాటు పైనుంచి గాలించేందుకు నేవీ హెలికాప్టర్‌ కూడా వినియోగించారు. సంబంధిత ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు అందరూ తమ పనులు వాయిదా వేసి మరీ.. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. మొత్తంగా ఆమె ఆచూకి కోసం 85 లక్షల నుంచి కోటి మధ్య ఖర్చు చేశామని విశాఖ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌ వెల్లడించారు.  దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెజాగ్ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించే అవకాశం ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్