Coconut Oil: మీరు కొబ్బరినూనె వాడుతున్నారా.. జరభద్రం మీ జుట్టంతా ఊడిపోవచ్చు.. ఎందుకంటే..

Vizianagaram News: మీ కళ్లు మిమ్మల్ని మోసం చేస్తాయి. అసలు ఏదో నకిలీ ఏదో గుర్తు పట్టలేనంతగా మాయ చేస్తాయి. అది మీ లోపం కాదు... నకిలీ ముఠాల ఎత్తుగడ. అచ్చం బ్రాండెడ్ వస్తువుల్లా కనిపిస్తాయి. కానీ క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే...అది నకిలీ బ్రాండ్. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా మీరు బోల్తాపడటం ఖాయం. అలాంటి ఉత్పత్తులు మార్కెట్లో చాలా ఉన్నాయి. మార్కెట్లో కాదు మన ఇంట్లో కూడా ఉన్నాయి. మనం వినియోగిస్తున్నవి అసలు బ్రాండెడ్ అనుకుని మనం వాటిని ఏంచక్కా వినియోగిస్తున్నాం. అంతా అసలుకు మించినట్లుగా ఉండటంతో..

Coconut Oil: మీరు కొబ్బరినూనె వాడుతున్నారా.. జరభద్రం మీ జుట్టంతా ఊడిపోవచ్చు.. ఎందుకంటే..
Coconut Hair Oil
Follow us
G Koteswara Rao

| Edited By: Sanjay Kasula

Updated on: Aug 21, 2023 | 8:20 PM

విజయనగరం, ఆగస్టు 21: సహజంగా దాదాపు అందరి ఇళ్ళలో కొబ్బరి నూనె ఉంటుంది. తల పై వెంట్రుకలు ఒత్తుగా పెరగాలని కొందరు, వెంట్రుకలు ఊడిపోకుండా బలంగా ఉండేందుకు మరికొందరు తలకు కొబ్బరినూనె రాస్తుంటారు. చిన్నపిల్లలకు అయితే కొబ్బరినూనె రాయడం తప్పనిసరి. కొందరు శరీరం మృదువుగా ఉండేందుకు ఒంటికి కూడా రాసుకుంటారు. ఇక ఇటీవల ఫేమస్ అయిన ఒక డైట్ లో అయితే కేజీలు కేజీలు త్రాగి శరీరం తగ్గించుకోవచ్చు అన్న పబ్లిసిటీ పీక్ కి వెళ్లడంతో కొబ్బరినూనె ఆవశ్యకత మరింత పాపులర్ అయ్యింది. అంతే కాకుండా కొబ్బరినూనె ప్రయోజనాల పై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరగడంతో కొబ్బరినూనె వాడకం కూడా అంతే స్థాయిలో పెరిగింది. దీంతో కొబ్బరి నూనె కొనే కస్టమర్లు మంచి బ్రాండ్స్ కోసం ప్రత్యేకంగా ఆరా తీసి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఇదే ఇప్పుడు నకిలీలకు వరంగా మారింది. కొబ్బరినూనె అనగానే దశాబ్ధాలుగా మార్కెట్ లో ఉన్న ప్యారాచూట్ బ్రాండ్ ని ఎక్కువగా వినియోగిస్తుంటారు కస్టమర్లు. దీంతో ఇదే బ్రాండ్ ని నకిలీ బ్రాండ్ గా తయారు చేయడానికి ఎంచుకున్నారు కల్తీ రాయుళ్లు. అచ్చం ప్యారచూట్ కొబ్బరినూనె బాటిల్ లాంటి మరో డూప్లికేట్ ప్యారాచూట్ కొబ్బరినూనె బాటిల్ తయారుచేసి అందులో నకిలీ కొబ్బరినూనె ను నింపుతున్నారు. అలా ఒకటి కాదు రెండు కాదు వేల కొద్దీ బాటిల్స్ తయారుచేసి మార్కెట్ లో దుకాణాలకు నేరుగా సరఫరా చేసున్నారు. కస్టమర్స్ కి కూడా తెలియక నకిలీ కొబ్బరినూనెని కొనుగోలు చేసి మోసపోతున్నారు. ఈ నకిలీ దందా సమాచారం తెలుసుకున్న పార్వతీపురం మన్యం జిల్లాలో విజిలెన్స్ అధికారులు దుకాణాల పై దాడులు చేశారు. పార్వతీపురం, సాలూరు పట్టణాల్లో స్థానికంగా పేరుగాంచిన కిరాణా షాపుల్లో ఉన్న వేలాది నకిలీ ప్యారాచూట్ బ్రాండ్ కొబ్బరి నూనె ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కిరాణా దుకాణాల యాజమానుల కేసులు నమోదు చేశారు. అయితే నకిలీ కొబ్బరి నూనె అని తమకి తెలియదని, ప్యారాచూట్ కొబ్బరినూనె అని మాత్రమే సరఫరా దారుల వద్ద తాము కొనుగోలు చేశామని అంటున్నారు దుకాణ యజమానులు. నకిలీ కొబ్బరినూనె తయారీదారుల పై చర్యలు తీసుకోవాలని, తమ పై కేసులు నమోదు చేయడం తగదని కోరుతున్నారు.

నకిలీ కొబ్బరి నూనెల వల్ల నష్టాలు..

కొబ్బరి నూనె కొనేటప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు డాక్టర్లు. బ్రాండెడ్ కొబ్బరి నూనె మాత్రమే వాడాలని, నకిలీ కొబ్బరి నూనె వల్ల అనేక దుష్ప్రభావాలు ఉంటాయని అంటున్నారు. నకిలీ కొబ్బరి నూనెలో స్వచ్ఛత ఉండదని, అందువల్ల తలకు రాసుకుంటే జుట్టు ఊడి పోయే ప్రమాదం ఉందని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా నకిలీ కొబ్బరినూనె శరీరానికి రాసుకున్న స్కిన్ డిసీజ్ లు వచ్చే ప్రమాదం ఉందని, అలాంటి కొబ్బరి నూనె చిన్నారుల పై మరింత ప్రభావం పడుతుందని చెప్తున్నారు. దాదాపు ప్రతి ఆహారం నకిలీ బ్రాండ్స్ తో తయారు అవుతున్నాయని, కాబట్టి కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.