AP Politics: లోకేష్ పాదయాత్రకు దూరంగా ఆ ఇద్దరు కీలక నేతలు.. పార్టీలో మొదలైన చర్చ..
Lokesh Yuva Galam: రాజకీయ ఆధిపత్యం కోసం జిల్లాలో ఉన్న మెజార్టీ ఇంచార్జిలు,ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసారు చిన్ని. దీంతో అవకాశం దొరికినప్పుడల్లా అధిష్టానంపై, కొంతమంది నాయకులమీదా తన అక్కసు వెళ్లగక్కుతున్నారు ఎంపీ కేశినేని.అటు లోకేష్ యువగళం పాదయాత్ర బాధ్యతలు కూడా సోదరుడు చిన్నికి అప్పగించడంతో మరింత అసంతృప్తికి లోనయ్యారని సమాచారం. లోకేష్ పాదయాత్ర విజయవాడలో కొనసాగినప్పడు..
నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమైన లోకేష్ పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాకు చేరుకుంది. విజయవాడ ప్రకాశం బ్యారేజి సమీపంలోని సీతానగరం చేరుకునే సరికి 2500 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా సీతానగరంలో శిలాఫలకం ఆవిష్కరించారు లోకేష్.వచ్చే ఎన్నికల్లో తాను పోటీచేయనున్న మంగళగిరి నియోజకవర్గంలో 20 వేల ఇళ్ల నిర్మాణానికి ఈ శిలాఫలకం వేసారు.
అధికారంలోకి రాగానే ఇళ్ల నిర్మాణం చేపడతామని లోకేష్ హామీ ఇచ్చారు.పాదయాత్రకు అన్ని జిల్లాల్లో పార్లమెంట్ ఇంచార్జిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గం ఇంచార్జిలతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరవుతున్నారు.ఉమ్మడి గుంటూరు జిల్లాలో పాదయాత్ర ముగిసిన తర్వాత ఉమ్మడి కృష్జా జిల్లాలోకి ప్రవేశించింది.ఈ రెండు ఉమ్మడి జిల్లాలు తెలుగుదేశం పార్టీకి ఎంతో కీలకమైనవి. పార్టీకి గతంలో అత్యధిక ఎమ్మెల్యే,ఎంపీ స్థానాలు తెచ్చిపెట్టాయి.అంతెందుకు వైఎస్సార్సీపీ ప్రభంజనం ఎక్కువగా ఉండి 151 సీట్లు గెలుచుకున్న సమయంలో కూడా గుంటూరు,విజయవాడ ఎంపీ స్థానాలు తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది.
కానీ లోకేష్ పాదయాత్రలో మాత్రం ఈ ఇద్దరు ఎంపీలు ఎక్కడా కనబడలేదు.గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్,విజయవాడ ఎంపీ కేశినేని నాని పాదయాత్రకు దూరంగా ఉన్నారు. ఉన్న ముగ్గురు ఎంపీలలో ఇద్దరు ఎంపీలు లోకేష్ కు దూరంగా ఉండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.
ఎంపీలు గల్లా జయదేవ్,కేశినేని నాని రాకపోవడంపై చర్చ
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్,విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇద్దరూ కూడా లోకేష్ యువగళం పాదయాత్రకు దూరంగా ఉండటం రాజకీయవర్గాల్లో చర్చగా మారింది.గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీలో కీలకమైన వ్యక్తి.,పార్టీతో ఎలాంటి విబేధాలు లేవు. అయినా ఉమ్మడి గుంటూరు జిల్లాలో నేతలంతా పాల్గొన్నప్పటికీ ఒక్క జయదేవ్ మాత్రం హాజరుకాకపోవడం చర్చగా మారింది. పాదయాత్రకు ఎందుకు దూరంగా ఉన్నారనేది ఎవరికీ అంతుపట్టడం లేదు.మరోవైపు కేశినేని నాని వ్యవహారం ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీలో ఉన్న విభేదాలను బయటపెట్టింది.ఇప్పటికే ఆయన సోదరుడు కేశినేని చిన్నిని పార్టీ అధినేత చంద్రబాబు ఎంకరేజ్ చేస్తున్నారంటూ ఆగ్రహంతో ఉన్నారు కేశినేని నాని.
రాజకీయ ఆధిపత్యం కోసం జిల్లాలో ఉన్న మెజార్టీ ఇంచార్జిలు,ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసారు చిన్ని. దీంతో అవకాశం దొరికినప్పుడల్లా అధిష్టానంపై, కొంతమంది నాయకులమీదా తన అక్కసు వెళ్లగక్కుతున్నారు ఎంపీ కేశినేని.అటు లోకేష్ యువగళం పాదయాత్ర బాధ్యతలు కూడా సోదరుడు చిన్నికి అప్పగించడంతో మరింత అసంతృప్తికి లోనయ్యారని సమాచారం. లోకేష్ పాదయాత్ర విజయవాడలో కొనసాగినప్పడు ఎక్కడా కేశినేని కనబడలేదు..కనీసం ఫ్లెక్సీల్లో ఫొటోలు కూడా లేవు.నాని వ్యవహారం టీడీపీ కి కొత్త తలనొప్పి తీసుకొస్తే వైఎస్సార్ సీపీ మాత్రం దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంది.సొంతపార్టీ నేతలే పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అవుతుందనే ఉద్దేశంతో దూరంగా ఉన్నారంటూ వైసీపీ విమర్శలు కురిపిస్తుంది.
వైసీపీకి ఆయుధంగా ఎంపీల గైర్హాజరు
లోకేష్ పాదయాత్రను విజయవాడ సిటీలో భారీ సక్సెస్ చేయడం ద్వారా మళ్లీ పాతవైభవం తెచ్చుకోవాలని టీడీపీ ప్రయత్నం చేసింది.విజయవాడ అభివృద్ది కూడా తెలుగుదేశం పార్టీనే చేసిందంటూ చెప్పుకొచ్చింది.అయితే పాదయాత్ర ను లైట్ తీసుకున్నామంటూ వైసీపీ నేతలు ప్రకటించారు. లోకేష్ పాదయాత్ర ఈవెనింగ్ వాక్ లా ఉందని,కిరాయి జనంతో పాదయాత్ర చేసారని చెప్పుకొస్తున్నారు.విజయవాడ అభివృద్ది టీడీపీ హయాంలో ఎందుకు చేయలేదో చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేసారు. పాదయాత్ర సక్సెస్ కాదనే ఉద్దేశంతోనే సొంతపార్టీ ఎంపీలు దూరంగా ఉన్నారంటూ మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న లోకేష్ పాదయాత్రకు ఉన్న ముగ్గురిలో ఇద్దరు ఎంపీలు హాజరుకాకపోవడంతో భవిష్యత్తులో ఎలాంటి నిర్నయాలు ఉంటాయో అనే చర్చ మొదలైంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం