Andhra Pradesh: డియర్ కన్జ్యూమర్ బిఅలర్ట్.. ఆ లింకు క్లిక్ చేస్తే మీ జేబుకు చిల్లే.. వివరాలు చూడండి..
Andhra Pradesh: ఓ మెసేజ్ చేస్తారు. అందులో ఏముంటుందంటే.. డియర్ కన్స్యూమర్.. మీరు గత నెల చెల్లించిన బిల్లు అప్డేట్ కాలేదు. ఈ రోజు నుంచి మీ ఇంటికి విద్యుత్తును నిలిపివేస్తామని ఉంటుంది. దయచేసి బిల్లు వెంటనే చెల్లేంచేందుకు ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి అంటూ మెసేజ్ లతో మోసాలు వెలుగుచూస్తున్నాయి. ఇటీవల విజయవాడ సూర్యాపేటలోని ఓ వైద్యుడి ఫోన్‌కు ఇలాంటి మెసేజ్ వెళ్లింది. అది నిజమని నమ్మిన ఆ వైద్యుడు

మీరు ఇంకా విద్యుత్ బిల్లు చెల్లించలేదంటూ ఒక మెసేజ్ వస్తుంది. ఆ లింక్ ను ఓపెన్ చేసి.. డబ్బు చెల్లించండి..లేదటే.. మీ ఇంటికి విద్యుత్ నిలిపివేయబడుతుంది అనే మెసేజ్ వస్తుంది. అది నిజమని నమ్మి.. మీరు ఆ లింక్ ను ఓపెన్ చేశారో ఇక అంతే సంగతులు.. ఇంతకూ ఏం జరుగుతుందనే కదా మీ డౌట్.. అప్పుడు కానీ.. అర్థం కాదు మీరు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారని..
ఇటీవలి కాలంలో సైబర్ మోసాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. తాజాగా వెలుగుచూసిన ఘటనను చూస్తే.. దిమ్మతిరిగిపోవాల్సిందే. అసలు ఇలా కూడా మోసాలు చేస్తారా అంటూ షాక్ తినాల్సిందే.. విద్యుత్ శాఖ నుంచి మెసేజ్ పంపించినట్లుగా ఓ మెసేజ్ చేస్తారు. అందులో ఏముంటుందంటే.. డియర్ కన్స్యూమర్.. మీరు గత నెల చెల్లించిన బిల్లు అప్డేట్ కాలేదు. ఈ రోజు నుంచి మీ ఇంటికి విద్యుత్తును నిలిపివేస్తామని ఉంటుంది. దయచేసి బిల్లు వెంటనే చెల్లేంచేందుకు ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి అంటూ మెసేజ్ లతో మోసాలు వెలుగుచూస్తున్నాయి. ఇటీవల విజయవాడ సూర్యాపేటలోని ఓ వైద్యుడి ఫోన్‌కు ఇలాంటి మెసేజ్ వెళ్లింది. అది నిజమని నమ్మిన ఆ వైద్యుడు ఆ లింక్ పై క్లిక్ చేయగా.. ఒక్కసారిగా రూ.60 వేలు కట్ అయ్యాయి. ఈ విధంగానే మరో వ్యక్తికి ఇలాంటి మెసేజ్ వెళ్లడంతో.. అతను కూడా లింక్ ను క్లిక్ చేయగా.. రూ. 21 వేలు కనిపించకుండా పోయాయి.
ఈ తరహా సైబర్ మోసాలను బాధిత వ్యక్తులు విద్యుత్ అధికారుల ద్రుష్టికి వెళ్లడంతో.. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. బిల్లులు చెల్లించాలని విద్యుత్తు అధికారులు ఎవరూ ఫోన్ చేయరని… లింక్ లు పంపి, బిల్లులు చెల్లించాలని అడగరని.. పేర్కొంటున్నారు. విద్యుత్తు అధికారుల పేరుతో అపరిచిత వ్యక్తులు పంపే మెసేజ్ లను చూసి.. మోసపోవద్దని సూచించారు. అలాంటి లింక్ లను ఓపెన్ చేస్తే.. మీ ఫోన్ నెంబర్ కు బ్యాంక్ ఖాతా లింక్ అయి ఉండటం వల్ల సైబర్ నేరస్తులకు మీ బ్యాంక్ అకౌంట్ డిటేయిల్స్ వెళ్లి.. వారు మనీ కాజేసేందుకు అవకాశం ఉందంటూ చెబుతున్నారు. ఓ వ్యక్తిని ఇదే విధంగా మోసం చేసి.. అతని ఖాతా నుంచి 7 విడతల్లో సుమారు రెండు లక్షల రూపాయలు కాజేయడంతో.. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.




ఇటీవల ఒక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తోన్న కట్టా విజయ్ కుమార్ ఫోన్ కు ఒక అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి.. అతను విద్యుత్ బిల్లు చెల్లించలేదని చెప్పాడు. తాను బిల్లు చెల్లించానని చెప్పినప్పటికీ.. ఆన్ లైన్ లో బిల్లును తనికీ చేసుకొమ్మని.. ఒక లింక్ను పంపించాడు. ఆ తర్వాత అతను చెప్పిన ‘రస్క్ డస్క్ ‘ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసుకోవాలంటూ ఒక లింక్ ను పంపాడు. విజయ్ కుమార్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని.. అందులో అడిగిన వివరాలు పంపించాడు. అదే రోజు రాత్రి సమయంలో విజయ్ కుమార్ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.29,999 విత్ డ్రా అయ్యాయి. ఇది గమనించిన విజయ్ అతను డౌన్లోడ్ చేసిన రస్క్ డస్క్ యాప్ ను తొలగించాడు. ఖాతాను తనిఖీ చేయగా.. అందులో నుంచి రూ.29,999, రూ.29,999, రూ.29,990, రూ.29,990, రూ.29,998, రూ.29,580, రూ.19,999 చొప్పున మొత్తం రూ. 1,99546లు విత్ డ్రా అయినట్లు గుర్తించారు. ఈ తరహా మోసాలకు గురికాకుండా విద్యుత్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..