AP News: స్మశానంలో బంగారం వేట.. మృతదేహాల బూడిదలో వెతుకులాట.. చివరికి.!

పొట్టకూటి కోసం ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. ఇప్పుడు మనం చెప్పుకునే కొన్ని కుటుంబాలు మాత్రం స్మశానంలోని చితాభస్మంలో స్వర్ణాన్వేషణ చేపడుతూ జీవనం సాగిస్తున్నారు. ఇంతకూ ఈ విధంగా జీవనం సాగించే తెగవారు ఎక్కడ ఉన్నారు..? వారు ఎంత కాలంగా ఇలా జీవిస్తున్నారు..?

AP News: స్మశానంలో బంగారం వేట.. మృతదేహాల బూడిదలో వెతుకులాట.. చివరికి.!
Graveyard
Follow us
M Sivakumar

| Edited By: Ravi Kiran

Updated on: Nov 20, 2024 | 5:12 PM

మనిషి జీవించడానికి ఎన్నో రకాల పనులను చేస్తుంటాడు. ఒక్కొక్కరు ఒక్కో విధమైన నైపుణ్యం కలిగి.. ఆయా రంగాల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకునే కొన్ని కుటుంబాలు మాత్రం అందుకు భిన్నం. ఎందుకంటే.. వారు స్మశానంలో స్వర్ణావేషణ చేస్తూ జీవనం సాగిస్తుంటారు. దహనం చేసిన పార్ధీవదేహం నుంచి బంగారం తీసి.. దాన్ని అమ్ముకోవడం ద్వారా జీవనం సాగిస్తున్నారు. దీంతో అసలు దహనం చేసిన మృతదేహం నుంచి బంగారం ఎలా లభిస్తుందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.

ఇది చదవండి: మీరు పుట్టిన తేదీని బట్టి మీ వెనకున్న దేవుడెవరో చెప్పొచ్చు.! ఎలాగో తెల్సా

సాధారణంగా మనిషి చనిపోయిన తర్వాత స్మశానంలో దహన సంస్కారాలైన తర్వాత చితాభస్మంను చనిపోయిన వారి ఆత్మ శాంతి కోసం కుటుంబ సభ్యులు కాశీలో లేదా గంగలో కలుపుతారు. హిందూ సంప్రదాయం ప్రకారం మరణించిన వారి నోటిలో కొంత బంగారాన్ని పెట్టి సాగనంపడం ఆనవాయితీగా వస్తోంది. మరికొందరు రేకు చనిపోయిన వారి నోట్లో పెడితే.. మరికొందరు వారు వాడిన ఉంగరాలు, దిద్దులు పెట్టి.. తమ ప్రేమ చాటుతుంటారు. ఇప్పటికే పలుచోట్ల ఆ ఆనవాయితీ కొనసాగుతోంది. దీంతో ఎన్టీఆర్ జిల్లాలోని పలు కుటుంబాలు స్మశానంలోని చితాభస్మం నుంచి వచ్చే బంగారం తీసి.. విక్రయించడం ద్వారా జీవనం సాగిస్తుంటారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: తస్సాదియ్యా.! పే..ద్ద టాస్కే ఇది.. పామును గుర్తిస్తే మీరే తెలివైనవారే

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో స్మశానం నుంచి తీసిన చితాభస్మంలో కొంత గంగలో కలపటానికి కుటుంబ సభ్యులు తీసుకోగా.. మిగిలిన చితాభస్మం నుంచి బంగారం తీసి, అ బంగారం మార్కెట్లో అమ్మి జీవనం సాగిస్తున్నాయి కొన్ని కుటుంబాలు. జగ్గయ్యపేట స్మశానం సమీపంలో జీవించే ఒక తెగవారు.. స్మశానంలో భస్మం చేసిన చితాభస్మంను పక్కనే ఉన్న పాలేటిలో కడిగి అందులో నుంచి బంగారం తీస్తారు. ఇలా వారు జీవనం సాగిస్తుండటంతో.. ఈ విషయం తెలిసి అందరు విస్తుపోతున్నారు.

ఇది చదవండి: బాబోయ్.. అది రోడ్డు కాదు భారీ కొండచిలువ.. పట్టు జారితే పరలోకానికే

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..