తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల.. పూర్తి వివరాలివే..

అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి కోసం ప్రత్యేక దర్శన టోకెన్లు విడుదల చేయనున్నారు. 24వ తేదీ ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు.

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల.. పూర్తి వివరాలివే..
Tirumala
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 20, 2024 | 10:23 AM

తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల ఫిబ్రవరి నెల కోటాను టీటీడీ గురువారం విడుదల చేయనుంది. కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను గురువారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేయనున్నారు. కాగా, మరికొన్ని ఆర్జితసేవా టికెట్లకు సంబంధించి ఎలక్ర్టానిక్‌ డిప్‌ కోటాను టీటీడీ ఇప్పటికే ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. వీటిని భక్తులు బుధవారం ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు.

ఇక, శ్రీవారి ఆలయంలో అంగ ప్రదక్షిణ టికెట్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి కోసం ప్రత్యేక దర్శన టోకెన్లు విడుదల చేయనున్నారు. 24వ తేదీ ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..