AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: మహానంది ఆలయంలో ఉద్రిక్తత.. భక్తులు, ఆలయ సిబ్బంది పరస్పర ‌దాడులు

నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం అయిన మహానందిలో భక్తులు,ఆలయ సిబ్బంది మద్య ఘర్షణ తలెత్తింది.మాట మాట పెరిగి ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. పోలీసులు పరిస్థితి సద్దుమణించి భక్తులను పోలీస్ స్టేషను తరలించడంతో వివాదానికి పుల్‎స్టాప్ పడి భక్తులు స్వామి,అమ్మవార్లను దర్శించుకోకుండానే వెనుదిరిగారు. అనంతపురం జిల్లా నర్రప్పల మండలానికి చెందిన ఓ కుటుంబానికి చెందిమ యాత్రికులు శ్రీ కామేశ్వరక సహిత మహానంధీశ్వర స్వామి దర్శనం కోసం వచ్చారు.

J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Sep 07, 2023 | 12:19 PM

Share

నంద్యాల జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం అయిన మహానందిలో భక్తులు,ఆలయ సిబ్బంది మద్య ఘర్షణ తలెత్తింది.మాట మాట పెరిగి ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. పోలీసులు పరిస్థితి సద్దుమణించి భక్తులను పోలీస్ స్టేషను తరలించడంతో వివాదానికి పుల్‎స్టాప్ పడి భక్తులు స్వామి,అమ్మవార్లను దర్శించుకోకుండానే వెనుదిరిగారు. అనంతపురం జిల్లా నర్రప్పల మండలానికి చెందిన ఓ కుటుంబానికి చెందిమ యాత్రికులు శ్రీ కామేశ్వరక సహిత మహానంధీశ్వర స్వామి దర్శనం కోసం వచ్చారు. సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు స్వామి అమ్మవార్లకు అష్టాదశ మహామంగళ హారతులు ఇస్తారు. ఈ సమయంలో సాధారణ భక్తుల దర్శనం అపివేస్తారు. మహామంగళహారతులు దర్శించుకోవాలనే భక్తులకు ఒకొక్కరికి రూ.150 రుసుం నిర్ణయించారు.

అయితే ఆ సమయంలో వచ్చిన అనంతపురానికి చెందిన భక్తులు గుంపులుగా వచ్చారు. దర్శనంకు అనుమతి ఇవ్వాలని అడగగా ప్రత్యేక రుసుం చెల్లించి దర్శించుకోవాలని ఆలయ సిబ్బంది సూచించారు. భక్తుల స్వామి, అమ్మవార్లను దర్శించుకోవాలంటే ఎందుకు డబ్బులు కట్టాలని నిలదీశారు. దీంతో భక్తులు,ఆలయ సిబ్బంది మధ్య మాట మాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితి సద్దుమణిగించారు. పరిస్థితి విషమించకుండా యాత్రికులను అందరిని స్థానిక మహానంది పోలీస్ స్టేషన్ తరలించి విచారించారు. దేవస్థానం ఆదాయమే పరమావధిగా భక్తుల నుంచి సేవల రూపంలో డబ్బులు వసూలు చేస్తూన్నారనే అరోపణలు భక్తుల నుంచి వెలువడుతున్నాయి. ఉచిత దర్శనాల విషయంలో సరైన బోర్డులు లేకపోవడం భక్తులు టిక్కెట్ రుసుం చెల్లించే వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇప్పటికైన అధికారులు భక్తులకు సరైన సూచనలు,ఉచిత‌ దర్శనం క్యూలైన్ల సంబంధించిన బోర్డులు ఏర్పాటు చెయ్యాలని భక్తులు డిమాండ్ చేస్తూన్నారు. అయితే ప్రముఖ శైవ క్షేత్రం అయిన మహానందిలో భక్తులు,ఆలయ సిబ్బంది మద్య ఘర్షణ తలెత్తడం స్థానికంగా చర్చనీయాశంమైంది. భక్తుల, ఆలయ సిబ్బంది మధ్య గొడవలు జరగడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్వామి, అమ్మవార్లను దర్శించుకోవాలంటే ఆలయ సిబ్బంది అసలు డబ్బులు అడగడం ఎందుకని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. భక్తులకు ఉచిత దర్శనం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే వీళ్ల మధ్య గొడవ జరగగా పోలీసులు రంగ ప్రవేశం చేయడం వల్లే పరిస్థితి సద్దుమణిగింది. అయితే ప్రస్తుతం ఈ గోడవపై విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ సమస్యకు పరిష్కారం చూపాలని భక్తులు కోరుతున్నారు. ప్రస్తుతం యాత్రికులందరు మహానంది పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు. అయితే వీరిని విచారించగా బయటికి పంపిస్తామని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..