AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ అంశంపై డిప్యూటీ సీఎం స్పెషల్ ఫోకస్.. అధికారులకు పవన్ కీలక ఆదేశాలు..

గ్రామీణాభివృద్ధికి సహకరించాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్. 250 జనభా కలిగిన ప్రతీ గ్రామానికి రహదారుల అనుసంధానం చేయాలని చెప్పారు. గ్రామాలకు రహదారుల అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తేనే ప్రగతి సాధ్యం అవుతుందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. అమరావతిలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు అధికారులు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంతో పవన్ కళ్యాణ్ సమీక్ష జరిపారు. 4 వేల 976 కోట్ల రూపాయల నిధులతో 7 వేల 213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి సిద్ధం చేసిన ప్రతిపాదనలకు చురుగ్గా కార్యరూపం ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు.

ఆ అంశంపై డిప్యూటీ సీఎం స్పెషల్ ఫోకస్.. అధికారులకు పవన్ కీలక ఆదేశాలు..
Deputy Cm Pawan Kalyan
Srikar T
|

Updated on: Jul 12, 2024 | 9:54 AM

Share

గ్రామీణాభివృద్ధికి సహకరించాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్. 250 జనభా కలిగిన ప్రతీ గ్రామానికి రహదారుల అనుసంధానం చేయాలని చెప్పారు. గ్రామాలకు రహదారుల అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తేనే ప్రగతి సాధ్యం అవుతుందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. అమరావతిలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు అధికారులు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంతో పవన్ కళ్యాణ్ సమీక్ష జరిపారు. 4 వేల 976 కోట్ల రూపాయల నిధులతో 7 వేల 213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి సిద్ధం చేసిన ప్రతిపాదనలకు చురుగ్గా కార్యరూపం ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో రహదారుల నిర్మాణం వల్ల పేదరిక నిర్మూలనతోపాటు.. సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు మెరుగవుతాయని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్. 250కి మించి జనాభా కలిగిన ప్రతి గ్రామానికి రహదారుల అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇక మ్యాచింగ్ గ్రాంటు విషయంలో కేంద్రంతో మాట్లాడి 10 శాతానికి తగ్గించేలా చూస్తానన్నారు.

2018-19 ఆర్ధిక సంవత్సరంలో మొదలైన ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యతతో కూడిన రహదారుల నిర్మాణం సాధ్యం అవుతుందన్నారు. ఇకనుంచి నెలకు రూ.200 కోట్లతో రహదారుల నిర్మాణం చేపడితే ఈ ప్రాజెక్టులో అద్భుతమైన పురోగతి కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 75 కోట్ల మ్యాచింగ్ గ్రాంటు సమకూరిస్తే బ్యాంకు రూ.125 కోట్ల రుణం మంజూరు చేస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో బిల్లుల చెల్లింపులో జాప్యం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణ ప్రక్రియ కుంటుబడిందని తెలిపారు. ఆ సమస్యను పరిష్కరిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యతతో కూడిన రహదారులు అందుబాటులోకి వచ్చేవన్నారు. తద్వారా గ్రామీణ అభివృద్ధి సాధ్యపడేదన్నారు. ఇక నుంచి గ్రామీణ రహదారి ప్రాజెక్టు ద్వారా రహదారుల నిర్మాణం, నిర్వహణ సక్రమంగా సాగేలా చూడాల్సిన బాధ్యత తాను తీసుకుంటానని.. పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ విభాగం పనుల్లో పారదర్శకతను ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో సమీక్షించేందుకు ప్రత్యేక పోర్టల్ అభివృద్ధి చేస్తామని చెప్పారు పవన్ కల్యాణ్. ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు వీలుగా ఆ పోర్టల్‌లో ప్రత్యేక కాలమ్ పొందుపర్చాలని ఆదేశించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..