Andhra Pradesh: ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ వేధింపులు తాళలేక దంపతుల ఆత్మహత్య.. షాక్​తో కుమారుడికి పక్షవాతం

తన కుటుంబ సభ్యులందరూ ఒకేసారి ఇలా అయిపోవడంతో వీరి కుమార్తె భార్గవి కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు కూడా అయ్యో పాపం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ వేధింపులు కారణంగానే ఆ కుంటుబ పరిస్థితి ఈ స్థికి వచ్చిందని వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Andhra Pradesh: ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ వేధింపులు తాళలేక దంపతుల ఆత్మహత్య.. షాక్​తో కుమారుడికి పక్షవాతం
Couple Suicide Finance Company Harassment
Follow us
T Nagaraju

| Edited By: Jyothi Gadda

Updated on: Sep 22, 2024 | 7:13 PM

కృష్ణమ్మ వరదలు అనేక కుంటుంబాలను రోడ్డున పడేశాయి. ప్రభుత్వం ఎంత మొత్తుకుంటున్న వరదతో నష్టపోయిన వారిపట్ల ఫైనాన్స్ కంపెనీలు చేస్తున్న వేధింపులు మాత్రం తగ్గటం లేదు. వేధింపులు తాళలేక భార్య, భర్త ఇద్దరూ పురుగు మందు తాగి చనిపోగా… కొడుకు పక్ష వాతం బారిన ఘటన అందరిని కంట తడి పెట్టిస్తుంది. ఈ విషాద సంఘటన బాపట్ల జిల్లా వేమూరు మండలంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

అతని పేరు పోలి శెట్టి శ్రీనువాసరావు…భార్య పేరు పుష్ఫలత వారికి ఇద్దరూ పిల్లలున్నారు. వీరిది బాపట్ల జిల్లా వేమూరు మండలం చదలవాడ గ్రామం. వీరి కుమార్తె భార్గవి ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో హైదరాబాద్ లో ఉంటుంది. కొడుకు లిఖిత్ కుమార్ ఇంటర్ పూర్తి చేశాడు. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో ఈ నెలలో క్రిష్ణా నదికి వచ్చిన వరదలు ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేశాయి. మూడేళ్ల క్రితం శ్రీనివాసరావు విజయవాడకు చెందిన ఐకేఎస్ ప్రవేటు ఫైనాన్స్ సంస్థ నుండి పదిహేను లక్షల రూపాయల రుణం తీసుకున్నారు. అప్పటి నుండి ఇన్ స్టాల్ మెంట్స్ కట్టుకుంటూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా ఎప్పటిలాగే పంటల సాగు చేస్తున్నారు.

అయితే ఈ నెలలో వచ్చిన వరదల కారణంగా పంటపై పెట్టుబడి అంతా నష్టపోయారు. తిరిగి పెట్టుబడి పెట్టకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో రెండు నెలల నుండి ఫైనాన్స్ కంపెనీకి చెల్లించాల్సిన వాయిదాలు చెల్లించలేకపోయారు. ఫైనాన్స్ కట్టకపోవడంతో కంపెనీ ప్రతినిధులు గురవారం చదలవాడ వచ్చారు. డబ్బులు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. డబ్బుల కట్టకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించి వెళ్లారు.

ఇవి కూడా చదవండి

ఈ విషయం ఊరంతా తెలిసి తమ పరువు పోతుందనుకున్నా భార్య భర్తలిద్దరూ చేబ్రోలు మండలం నారాకోడూరు సమీపంలోని పంట పొలాల్లోకి వెళ్లి పురుగు మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భార్య పుష్సలత అక్కడికక్కడే చనిపోగా శ్రీనివాసరావును గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాసరావు కూడా చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న కుమారుడు లిఖిత్ కుమార్ షాక్ కు లోనయ్యాడు. దీంతో పక్షవాతం వచ్చింది. ప్రస్తుతం అతని కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు.

తన కుటుంబ సభ్యులందరూ ఒకేసారి ఇలా అయిపోవడంతో వీరి కుమార్తె భార్గవి కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు కూడా అయ్యో పాపం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ వేధింపులు కారణంగానే ఆ కుంటుబ పరిస్థితి ఈ స్థికి వచ్చిందని వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వరదలు వచ్చినా ప్రాంతాల్లో వాయిదాలు చెల్లించమని ఒత్తిడి చేయవద్దని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించినా ఆయా కంపెనీలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఫైనాన్స్ తీసుకున్నా వారు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇకముందైనా ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..