అధికారులకు దిమ్మదిరిగేలా.. గుంతల రోడ్లపై పూలమొక్కలు..! క్షణాల్లో దిగొచ్చిన అధికార యంత్రాంగం..!! ఎక్కడంటే

ఇప్పుడు ఆ 22 ఏళ్ల హ్యారీ బకెట్ నిండా మట్టి, మొక్కలను తీసుకుని రోడ్డుపై తిరుగుతున్నాడు. గత రెండు నెలల్లో దాదాపు 40 గుంటల్లో పూల మొక్కలు నాటినట్లు చెబుతున్నారు. దీని తర్వాత చాలా వరకు గుంతలకు మరమ్మతులు చేశారు. సోషల్ మీడియా వేదికగా హ్యారీ స్మిత్-హాగెట్‌కు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది.

అధికారులకు దిమ్మదిరిగేలా.. గుంతల రోడ్లపై పూలమొక్కలు..! క్షణాల్లో దిగొచ్చిన అధికార యంత్రాంగం..!! ఎక్కడంటే
Strange Way To Fix A Pothol
Follow us

|

Updated on: Sep 22, 2024 | 6:27 PM

రోడ్డుపై గుంతల వల్ల డ్రైవింగ్‌కు ఇబ్బంది కలుగుతుంది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తరచూ ప్రమాదాల బారినపడుతుంటారు. కానీ, అధికారుల నిర్లక్ష్యంతో ఈ సమస్య మరింత తీవ్రంగా మారుతుంది. రోడ్డు గుంతల కారణంగా కష్టాలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి సంబంధిత అధికారుల పనితీరును బహిర్గతం చేయడానికి వినూత్న పద్ధతిని అనుసరించాడు. ఎవరూ ఊహించని విధంగా అతడు అధికారులకు గట్టి ఝలక్‌ ఇచ్చాడు.. దీంతో ఆ యువకుడు చేసిన పనిని ప్రజలు పెద్ద ఎత్తున ప్రశంసించారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

బ్రిటన్‌లో రోడ్డు గుంతల కారణంగా ఇబ్బందులు పడుతున్నామంటూ హ్యారీ స్మిత్-హాగెట్ అనే యువకుడు పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నాడు. కానీ, ఎవరూ పట్టించుకోవడం లేదు. రోడ్డు గుంతల కారణంగా ప్రయాణం నరకంగా మారిందని అతడు వాపోయాడు. దీంతో సంబంధిత అధికారుల మెడలు వచ్చేందుకు అతడు వెరైటీ నిరసన తెలియజేశాడు. సమస్యపై అతను పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నప్పటికీ అధికార యంత్రాంగంలో ఎలాంటి చలనం లేకపోవడంతో..అతడే స్వయంగా రంగంలోకి దిగాడు. రోడ్డుపై ఏర్పడ్డ గుంతల్లో రకరకాల మొక్కలు నాటడం మొదలుపెట్టాడు. దీంతో ప్రజలు రోడ్డుపై ఏర్పడ్డ గుంతలను తేలిగ్గా గమనించి ప్రమాదాల బారిన పడకుండా ఉంటున్నారు. ఈ దృశ్యం క్రమంగా సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

దాంతో గుంతలను సరిచేయడానికి హటాహుటిన అధికారులే రంగంలోకి దిగాల్సి వచ్చింది. హ్యారీ స్మిత్-హాగెట్ చేసిన ఫిర్యాదు మేరకు ఆ మార్గంలోని గుంతలన్నింటిని నిమిషాల వ్యవధిలోనే మరమ్మతులు పూర్తి చేశారు. దీంతో యువకుడు చేసిన పనికి ప్రజలు ప్రశంసలతో ముంచెత్తారు. హ్యారీ స్మిత్-హాగెట్ నాటిన మొక్కలు అధికారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. దాంతో హుటాహుటిన అధికారులు మరమ్మతు పనులను పూర్తి చేశారు.ఎక్కడ రోడ్డుపై ఏర్పడ్డ గుంతలు ఏర్పడిన వాటిని పూడ్చేందుకు హ్యారీ స్మిత్-హాగెట్ అక్కడకు వెళ్లి మొక్కలు నాటడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆ 22 ఏళ్ల హ్యారీ బకెట్ నిండా మట్టి, మొక్కలను తీసుకుని రోడ్డుపై తిరుగుతున్నాడు. గత రెండు నెలల్లో దాదాపు 40 గుంటల్లో పూల మొక్కలు నాటినట్లు చెబుతున్నారు. దీని తర్వాత చాలా వరకు గుంతలకు మరమ్మతులు చేశారు. సోషల్ మీడియా వేదికగా హ్యారీ స్మిత్-హాగెట్‌కు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..