Viral: అమ్మాయిలతో గుంజీలు తీయించిన ప్రిన్సిపాల్.. ఆ తర్వాత ఎమ్మెల్యే ఎంట్రీ.!
ఆంధ్రప్రదేవ్ అల్లూరి జిల్లా రంపచోడవరంలోని ఏపీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. క్రమశిక్షణ పేరుతో ప్రిన్సిపల్ , ఫిజికల్ డైరక్టర్... విద్యార్థినులతో మూడు రోజులు వరుసగా 100కు పైగా గుంజీలు తీయించారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు.. చెప్పిన మాట వినడం లేదని ఇలా గుంజీలు తీయించారు. సోమవారం కూడా అలాగే చేయడంతో 50 మంది విద్యార్థినిలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఆంధ్రప్రదేవ్ అల్లూరి జిల్లా రంపచోడవరంలోని ఏపీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. క్రమశిక్షణ పేరుతో ప్రిన్సిపల్ , ఫిజికల్ డైరక్టర్… విద్యార్థినులతో మూడు రోజులు వరుసగా 100కు పైగా గుంజీలు తీయించారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు.. చెప్పిన మాట వినడం లేదని ఇలా గుంజీలు తీయించారు. సోమవారం కూడా అలాగే చేయడంతో 50 మంది విద్యార్థినిలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొందరు నడవలేని స్థితికి చేరుకున్నారు. తల్లిదండ్రులకు సమాచారం అందడంతో వారు కాలేజీకి చేరుకుని పిల్లలను ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.
వారిలో సాయంత్రానికి కోలుకున్న కొందరిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కాగా, బాలికలను చేతులపై మోసుకెళ్తున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై ఎమ్మెల్యే శిరీష స్పందించారు. క్రమశిక్షణ పేరిట విద్యార్థినుల చేత గుంజీలు తీయించడం దారుణమైన చర్య అని పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని ఐటీడీఏ పీఓను ఆదేశించారు. స్థానిక ఏరియా ఆసుపత్రికి వెళ్లిన ఎమ్మెల్యే, బాలికలను చూసి, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ‘ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులూ రావడం లేదు. నా సొంత డబ్బులతో మీ అందరికీ భోజనం పెడుతున్నాను’ అని ప్రిన్సిపల్ ప్రసూన అంటున్నారని విద్యార్థినులు ఎమ్మెల్యే ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. దాంతో ఏదైనా సమస్య ఉంటే తనతో చెప్పాలని బాలికలకు ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

