AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moaists: మావోయిస్ట్ ఆవిర్భావ వారోత్సవాలు.. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో టెన్సన్.. టెన్సన్..

ఆంధ్ర ఒడిశా సరిహద్దులో టెన్సన్ వాతావరణం నెలకొంది. మావోయిస్ట్ ఆవిర్భావ వారోత్సవాల సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాల్లో మావోల కదలికలపై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోట అయిన ఆంధ్ర - ఒడిశా బోర్డర్‎లో ప్రస్తుతానికి తమ ప్రాబల్యం తగ్గినప్పటికీ ఉనికి చాటుకునేందుకు సరిహద్దులో తరుచూ ఏదో ఒక దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు మావోలు. ఏవోబిలో మావోల కదలికలు లేవని పోలీసులు ప్రకటిస్తున్నప్పటికీ మావోలు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు.

Moaists: మావోయిస్ట్ ఆవిర్భావ వారోత్సవాలు.. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో టెన్సన్.. టెన్సన్..
Maoists
Gamidi Koteswara Rao
| Edited By: |

Updated on: Sep 21, 2023 | 8:35 PM

Share

ఆంధ్ర ఒడిశా సరిహద్దులో టెన్సన్ వాతావరణం నెలకొంది. మావోయిస్ట్ ఆవిర్భావ వారోత్సవాల సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాల్లో మావోల కదలికలపై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోట అయిన ఆంధ్ర – ఒడిశా బోర్డర్‎లో ప్రస్తుతానికి తమ ప్రాబల్యం తగ్గినప్పటికీ ఉనికి చాటుకునేందుకు సరిహద్దులో తరుచూ ఏదో ఒక దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు మావోలు. ఏవోబిలో మావోల కదలికలు లేవని పోలీసులు ప్రకటిస్తున్నప్పటికీ మావోలు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఏదో ఒక కార్యక్రమం ద్వారా తాము ఉన్నామని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ఆంధ్ర, అటు ఒడిశా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కరపత్రాలు, బహిరంగ లేఖలు విడుదల చేస్తూ ప్రజా ప్రతినిధులపై బెదిరింపులకు దిగుతున్నారు.

ఇటీవల బోర్డర్ లోని నారాయణ పట్నం బ్లాక్ చిస్ గూడ వద్ద ఖంజావతి నది పై చెక్ డ్యాం కట్టడానికి వీలు లేదని, చెక్ డ్యామ్ కడితే తీవ్ర పరిణామలు తప్పవని హెచ్చరిస్తూ కరపత్రాలు కూడా విడుదల చేశారు. అంతే కాకుండా రాయగడ జిల్లాలో రహదారి నిర్మాణ పనులు జరుగుతుండగా కాంట్రాక్టర్‎కు చెందిన జేసిబీ సహా పలు వాహనాలను తగలబెట్టి ఘాతుకానికి పాల్పడ్డారు. ఇలా దొరికిన ప్రతి అవకాశాన్ని వదలకుండా తమ ఉనికిని చాటుకోవడంతో పాటు మావో రిక్రూట్మెంట్‎ల కోసం కూడా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుత మావో ఆవిర్భావ వారోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించి ఏవోబిలో తమ పట్టు ఏ మాత్రం సడలలేదని తెలిపేందుకు ఉవ్విళ్లరుతున్నారు మావోలు. ఇదే తరుణంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. మావో ఆవిర్భావ వారోత్సవాల్లో ఎలాంటి దుశ్చర్యలు జరగకుండా దృష్టి సారించారు. బోర్డర్స్ లో చెక్ పోస్టులు పెట్టి ముమ్మర వాహన తనిఖీలు చేపట్టారు.

ముఖ్య నాయకులకు భద్రత పెంచడంతో పాటు తమకు సమాచారం ఇవ్వకుండా మారుమూల ఏజెన్సీ గ్రామాల్లోకి వెళ్ళొద్దని ముఖ్య నేతలకు, అధికారులకు సూచించారు. పాదచారుల నుండి పెద్ద పెద్ద వాహనాల వరకు తనిఖీలు చేసి వారి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పాచికుంట మండలం పి.కోనవలస చెక్ పోస్ట్ వద్ద అదనపు పోలీసు యంత్రాంగాన్ని పెట్టి గస్తీ కాస్తున్నారు. వారం రోజుల పాటు జరిగే వారోత్సవాల్లో ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏజెన్సీ గ్రామాల్లో రాత్రి సమయంలో బస్సులు ఉంచొద్దని ఆదేశించారు. మావోలు ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. జరుగుతున్న పరిణామాలతో స్థానిక గిరిజనులు భయం భయంగా కాలం గడుపుతున్నారు.. అయితే మావోల నుండి స్థానిక గిరిజనులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అంటున్నారు పోలీసులు. తాము అన్ని రకాల చర్యలు చేపట్టామని, ఎవరు భయపడొద్ధని, ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగినా తమను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..