శ్రీశైలంలో ఉగాది మహోత్సవాల సందర్భంగా అందుబాటులో ఈ సేవలు..
నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఏప్రిల్ 6 నుండి 10 వరకు ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. ఈనేపథ్యంలో ఉత్సవాలకు ఉత్తర కర్ణాటక, మహారాష్ట్ర నుండి భక్తులు తరలివస్తారు. ఈ కారణంగా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతంలోని పలు భక్తసంఘాలు, పాదయాత్ర బృందాలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు దేవస్థానం అర్చకులు, ఆలయాధికారులు.

నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఏప్రిల్ 6 నుండి 10 వరకు ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి. ఈనేపథ్యంలో ఉత్సవాలకు ఉత్తర కర్ణాటక, మహారాష్ట్ర నుండి భక్తులు తరలివస్తారు. ఈ కారణంగా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతంలోని పలు భక్తసంఘాలు, పాదయాత్ర బృందాలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు దేవస్థానం అర్చకులు, ఆలయాధికారులు. ఈ సమావేశం బాగల్కోట్ జిల్లా రబ్బని పట్టణంలో శ్రీదానేశ్వరీ కల్యాణమండపంలో జరిగింది. సమావేశానికి శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీ చెన్న సిద్దరామ శివాచార్య మహాస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు మాట్లాడుతూ.. ఉగాది మహోత్సవాలలో 6వ తేదీ నుండి 10వతేదీ వరకు భక్తులందరికీ శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించడం జరుగుతుందన్నారు. ఉత్సవరోజులలో శ్రీస్వామివారి స్పర్శదర్శనానికి అవకాశం ఉండదని తెలియజేశారు. ఉత్సవాలకు 10 రోజుల ముందు నుంచి అనగా 27వ తేదీ నుండి 5 వ తేదీ వరకు నిర్దిష్ట వేళలలో నాలుగు విడతలుగా భక్తులకు శ్రీస్వామివారి స్పర్శదర్శనానికి అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. స్పర్శదర్శనం టికెట్ రూ. 500 గా నిర్ణయించామన్నారు.
కన్నడ భక్తులు శ్రీభ్రమరాంబాదేవిని తమ ఆడపడుచుగా, శ్రీమల్లికార్జునస్వామివార్లను తమ అల్లునిగా భావిస్తారన్నారు. అలానే కాలిబాటలో వచ్చే భక్తులకు మంచినీరు, మార్గమధ్యంలో దాతల సహకారంతో అన్నదాన ఏర్పాట్లు, సామాన్య భక్తుల సౌకర్యార్థం క్షేత్రపరిధిలోని ఆరుబయలు ప్రదేశాలలో చలువ పందిర్లను, పలుచోట్ల స్నానపు గదులను, మరుగుదొడ్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. పాతాళగంగలో నీటిమట్టం తగ్గే అవకాశం ఉన్నందున పాతాళగంగలోనూ, క్షేత్రపరిధిలో పలుచోట్ల షవర్ బాతులకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అందువల్ల భక్తులందరూ దేవస్థానానికి సహకరించి తమ శ్రీశైలయాత్రను శుభప్రదం చేసుకోవాలని అధికారులు కర్ణాటక, మహారాష్ట్ర భక్తులను కోరారు. అలానే శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి మాట్లాడుతూ.. ఉత్సవాలలో దేవస్థానం సిబ్బందికి కన్నడ భక్తులందరు సహకరించాలన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








