కన్నుల పండువగా కోరుకొండ శ్రీలక్ష్మి నరసింహ స్వామి కళ్యాణం..

కన్నుల పండువగా కోరుకొండ శ్రీలక్ష్మి నరసింహ స్వామి కళ్యాణం..

Pvv Satyanarayana

| Edited By: Srikar T

Updated on: Mar 21, 2024 | 9:43 AM

తూర్పుగోదావరి జిల్లా, కోరుకొండ ప్రసిద్ధ శ్రీలక్ష్మి నరసింహ స్వామి కళ్యాణం వేదపండితుల నడుమ వేదోచ్చారణలతో కన్నుల పండుగగా సాగింది. స్వామి వారి కళ్యాణం చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణంలో నిండిపోయింది.

తూర్పుగోదావరి జిల్లా, కోరుకొండ ప్రసిద్ధ శ్రీలక్ష్మి నరసింహ స్వామి కళ్యాణం వేదపండితుల నడుమ వేదోచ్చారణలతో కన్నుల పండుగగా సాగింది. స్వామి వారి కళ్యాణం చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణంలో నిండిపోయింది. వివిధ ప్రాంతాల నుండి ప్రతి ఏటా వచ్చే భక్తులకు స్వామివారి కళ్యాణంలో పాల్గొనేందుకు ఆలయ అధికారులు అవకాశం కల్పించారు. అనంతరం స్వామి కళ్యాణం విశిష్టతను వివరిస్తూ, తెల్లవారుజామున వరకు మహోత్సవం సాగింది. స్వామి కల్యాణం చూసేందుకు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు.

అనంతరం వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. స్వామి కళ్యాణ మహోత్సవం ముందుగా అంకురార్పణతో మొదలై గ్రామ పురవీధుల్లో పెద్ద రథంపై ఊరేగింపుగా సాగింది. రథోత్సవం సమయంలో గ్రామ ఆచారం ప్రకారం అరటిపండ్లుతో ప్రత్యేక ఘట్టం సాగింది. అరటి పండ్లను రథంపై వేస్తే కొరినకోర్కెకెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే అరటిపండ్లు రథంపై విసురుతూ ఊరేగింపు ముందుకు సాగింది. ఈ ఏడాది అకాలవర్షం పడడంతో రథోత్సవానికి కొంత అంతరాయం కల్గినప్పటికీ.. భక్తులు ఏ మాత్రం తగ్గకుండా స్వామి ఊరేగింపు సాఫీగా సాగింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..