Women’s in Poling: పేర్లు చెప్పం.. నేను ఫలానావారి భార్యను.! రాసుకో.. వీడియో వైరల్.

పూర్వం భార్యలు తమ నోటి వెంట భర్త పేరును ఉచ్ఛరించడానికి కూడా సాహసించేవారు కాదు. భర్త ను పేరు పెట్టి పిలవడం, సంభోదించడం తప్పుగా భావించేవారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తి భిన్నం అనుకోండి.. అసలు విషయం ఏంటంటే... భర్త పేరు ఉచ్ఛరించడమే కాదు.. కొన్ని సందర్భాల్లో తమ పేర్లను కూడా చెప్పేవారు కాదు మహిళలు. వారు ఫలానావారి భార్యగా పరిచయం చేసుకునేవారే కానీ తమ పేర్లను చెప్పడానికి అంగీకరించేవారు కాదు.

Women's in Poling: పేర్లు చెప్పం.. నేను ఫలానావారి భార్యను.! రాసుకో.. వీడియో వైరల్.

|

Updated on: Mar 21, 2024 | 8:55 AM

పూర్వం భార్యలు తమ నోటి వెంట భర్త పేరును ఉచ్ఛరించడానికి కూడా సాహసించేవారు కాదు. భర్త ను పేరు పెట్టి పిలవడం, సంభోదించడం తప్పుగా భావించేవారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తి భిన్నం అనుకోండి.. అసలు విషయం ఏంటంటే… భర్త పేరు ఉచ్ఛరించడమే కాదు.. కొన్ని సందర్భాల్లో తమ పేర్లను కూడా చెప్పేవారు కాదు మహిళలు. వారు ఫలానావారి భార్యగా పరిచయం చేసుకునేవారే కానీ తమ పేర్లను చెప్పడానికి అంగీకరించేవారు కాదు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి మొదటిసారి ఎన్నికలు నిర్వహించిన సందర్భంలో ఎన్నికల కమిషన్‌కు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. దాంతో ఆ మహిళలను ఓటరు జాబితానుంచి తొలగించాల్సి వచ్చింది. భారతదేశంలో మొట్టమొదటిసారి 1951-52లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్‌కు ఈ చిత్రమైన సమస్య ఎదురైంది. ఓటర్ల జాబితాలు తయారు చేసేటప్పుడు మహిళలు తమ అసలు పేర్లు చెప్పకుండా ఫలానా వ్యక్తి భార్యననో, కుమార్తెననో చెప్పసాగారు. స్థానిక ఆచారాలు, సంప్రదాయాలే ఈ పరిస్థితికి కారణం. ఇలాంటి కేసులన్నీ బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్య భారత్‌, రాజస్థాన్‌, వింధ్య ప్రదేశ్‌లలోనే ఎదురయ్యాయి. అప్పట్లో దేశంలోని మహిళా ఓటర్ల సంఖ్య 8 కోట్లు ఉండగా, వారిలో 28 లక్షల మంది సొంత పేర్లు చెప్పకుండా భర్తలు, తండ్రుల పేర్లు చెప్పడంతో వారి పేర్లను ఓటరు జాబితాల నుంచి తొలగించారు. పేర్లు తొలగించడానికి ముందు సొంత పేర్లు చెప్పడానికి మహిళా ఓటర్లకు నెల రోజుల వ్యవధి కూడా ఇచ్చారు. దీన్ని బిహార్‌లో చాలామంది సద్వినియోగం చేసుకున్నారు. కానీ రాజస్థాన్‌ మహిళలు మాత్రం పేర్లు చెప్పడానికి ముందుకురాలేదు. దీంతో అలాంటి 28 లక్షల మంది పేర్లను గడువు ముగిసిన తరవాత తొలగించారు.

పితృస్వామ్య సమాజం నీడ నుంచి స్త్రీలను విముక్తం చేయడానికి ఎన్నికల కమిషన్‌ ప్రాధాన్యమివ్వడం వల్లనే మహిళా ఓటర్లు సొంత పేర్లు చెప్పాలని పట్టుబట్టింది. 1950లో భారత్‌ గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించడానికి ఒక రోజు ముందు ఏర్పడిన ఎన్నికల సంఘం ఇంతవరకు 17 లోక్‌సభ ఎన్నికలు నిర్వహించింది. మొదటిసారి ఎన్నికలు నిర్వహించేటప్పుడు భౌగోళిక, జనవర్గ పరంగా పలు సవాళ్లను ఎదుర్కొంది. అప్పట్లో అత్యధిక జనాభా నిరక్షరాస్యులు కావడం కూడా పెద్ద సమస్యగా మారింది. నాడు పేరు చెప్పడానికే సంకోచించిన మహిళా ఓటర్లు నేడు పురుషులను మించి పోలింగ్‌లో పాల్గొంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us