AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శాంతిభద్రతల విషయంలో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు..

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆంధ్రప్రదేశ్‎లో ఎన్నికల కమిషన్ అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. రాష్ట్రంలో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనుండటంతో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల కోడ్ అమలు ఉల్లంఘనలపై ఎప్పటికప్పుడు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.

శాంతిభద్రతల విషయంలో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు..
State Chief Electoral Officer (ceo) Mukesh Kumar Meena
pullarao.mandapaka
| Edited By: Srikar T|

Updated on: Mar 23, 2024 | 8:18 AM

Share

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆంధ్రప్రదేశ్‎లో ఎన్నికల కమిషన్ అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. రాష్ట్రంలో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనుండటంతో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల కోడ్ అమలు ఉల్లంఘనలపై ఎప్పటికప్పుడు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్‎లు నిర్వహిస్తూ ఎన్నికల కోడ్ ఆములపై దిశా నిర్దేశం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కొత్తగా ఓట్ల తొలగింపునకు సంబంధించి ఎలాంటి దరఖాస్తులు స్వీకరించడం లేదు. ఒకచోట ఉన్న ఓటును మరొకచోటకి బదిలీ చేసుకునే అవకాశం కూడా లేదు. కానీ కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు మాత్రం ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. ఇప్పటివరకు ఓట్ల తొలగింపునకు సంబంధించి వచ్చిన ఫారం -7 దరఖాస్తులతో పాటు ఓట్ల మార్పునకు సంబంధించి వచ్చిన ఫార్మ్ – 8 దరఖాస్తుల పరిష్కారంపై దృష్టి పెట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఈఓ మీనా ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 26వ తేదీలోగా పెండింగ్లో ఉన్న అన్ని దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్లకు సూచించారు. ఓట్ల తొలగింపుపై గతంలో పెద్ద ఎత్తున ఎన్నికల కమిషన్‎కు ఫిర్యాదులు అందాయి.

అన్ని ప్రధాన పార్టీలు తమ సానుభూతిపరుల ఓట్లను ఆన్లైన్లో నకిలీ దరఖాస్తులతో తొలగించేస్తున్నారని ఎన్నికల కమిషన్‎కు ఫిర్యాదులు చేశాయి. దీంతో ప్రతి ఒక్క దరఖాస్తును క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే తొలగింపు లేదా మార్పుపై నిర్ణయం తీసుకోవాలని సీఈవో గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో దానికి ముందు వరకు వచ్చిన దరఖాస్తులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఇలాంటి దరఖాస్తులను నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలని సూచించారు. ఇక రాజకీయ పార్టీలకు సంబంధించి ఎన్నికల కోడ్ పక్కాగా అమలు చేసేలా అన్ని పార్టీలకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. రాజకీయ పార్టీలు నిర్వహించే ఎలాంటి కార్యక్రమాలకు అయినా ఎన్నికల కమిషన్ ముందస్తు అనుమతి తప్పనిసరి అని.. ఈ విషయంలో అలాంటి మినహాయింపులు ఉండవని జిల్లా కలెక్టర్లకు సీఈఓ మీనా సూచించారు. రాజకీయ పార్టీల కార్యక్రమాల కోసం అనుమతులను నేరుగా గాని లేదా పోర్టల్ ద్వారా గాని తీసుకోవచ్చని తెలిపారు. అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి త్వరితగతిన చాలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సీఈఓ సూచించారు.

శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉండాలి సీఈఓ ఆదేశాలు

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఇప్పటికే మూడు జిల్లాల ఎస్పీల నుంచి ఎన్నికల కమిషన్ వివరణ తీసుకుంది. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని ఎక్కడా ఎలాంటి హింసాత్మక ఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఈవో మీనా అన్ని జిల్లాల పోలీస్ అధికారులకు సూచించారు. శాంతిభద్రతల విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని పదేపదే చెబుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలను పిలిచి ఎలాంటి ఆందోళనలో తమ పార్టీ కార్యకర్తలు పాల్గొనకుండా ముందే హెచ్చరించాలని చెబుతున్నారు. ఎన్నికల సందర్భంగా జరుగుతున్న తనిఖీలు, ఆస్తుల జప్తుపై కేంద్ర ఎన్నికల సంఘం వచ్చేనెల మూడో తేదీన అన్ని రాష్ట్రాల సి.ఎస్‎లతో సమీక్ష నిర్వహించనుంది. దీంతో రాష్ట్రంలో ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టంను విస్తృతంగా మెరుగుపరచాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు సీఈఓ సూచించారు. అన్ని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలను అప్రమత్తం చేయాలని జిల్లా బార్డర్‎లోనే కాకుండా అన్ని సరిహద్దు ప్రాంతాల్లో కూడా నిఘాను పటిష్ట పరచాలని ఆదేశించారు. ప్రతి బోర్డర్ చెక్ పోస్ట్‎ల వద్ద కెమెరాలతో స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‎ను ఏర్పాటు చేయాలని సూచించారు. 33 విభాగాలకు చెందిన ఉద్యోగులకు పోస్టల్ ఉద్యోగ సౌకర్యాన్ని కల్పించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. అక్రమ నగరవేషంలో మరింత జాగ్రత్తగా తనిఖీలు చేయాలని సూచించారు. ఎన్నికల కోడ్ విషయంలో ఎక్కడ ఎలాంటి మినహాయింపులు లేకుండా పగడ్బందీగా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల అధికారులకు సీఈఓ సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..