AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: కోళ్ల మేత ఉంచిన పాత్ర నుంచి ఏవో శబ్దాలు.. ఏంటా అని చూడగా..

ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం కొత్తపేటలో ఓ వ్యక్తి కోళ్లను పెంచుతున్నాడు. ఉదయం, సాయంత్రం వాటికి మేత వేస్తూ ఉంటాడు. కోళ్ల మేత ఉంచేందుకు ఓ జారు ఏర్పాటు చేసుకున్నాడు. తాజాగా ఆ జారు నుంచి ఏవో శబ్దాలు రావడంతో వెళ్లి చూడగా గుండె దడ ఒక్కసారిగా పెరిగింది.

Andhra: కోళ్ల మేత ఉంచిన పాత్ర నుంచి ఏవో శబ్దాలు.. ఏంటా అని చూడగా..
Poultry Feed Jar (Representative image )
B Ravi Kumar
| Edited By: |

Updated on: May 28, 2025 | 12:25 PM

Share

వర్షాలు మొదలయ్యాయి. ముసురుపట్టి వాతావరణం చల్లబడటంతో ఎండవేడి, అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోలేక.. పుట్టలు, కలుగుల్లో దాక్కున్న పాములు బయటకు వస్తుంటాయి. పొదల మాటున ఎక్కడపడితే అక్కడ వచ్చి చేరుతుంటాయి. ఇలాంటి సమయాల్లోనే  జాగ్రత్తగా ఉండాలి. అప్రమత్తంగా వ్యవహరించాలి. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం కొత్తపేటలో తన ఇంటి ఆవరణలో మంచం నాగేశ్వరరావు కోళ్లను పెంచుతుంటాడు. వాటికి మేత వేసేందుకు.. వెళ్లగా అతనికి అక్కడ  శబ్ధాలు వినిపించాయి. ఏంటా పరిశీలించిన అతనికి కోళ్ల మేతలో నాగుపాము దర్శనమిచ్చింది. దెబ్బకు భయంతో అక్కడినుంచి ఒక్క ఉదుటన ఇవతలికి వచ్చాడు.

మొదట ఆ శబ్దాలు ఎక్కడినుంచి వస్తున్నాయో అతనికి అర్థం కాలేదు. జాగ్రత్తగా ఆలకిస్తే అక్కడ కోళ్ల మేత కోసం ఉంచిన రేకు జారు నుంచి శబ్దాలు బయటకు వస్తున్నట్లు గుర్తించాడు. త్రాచు పాము అందులో చుట్ట చుట్టుకొని పైకి లేచి పడగ విప్పి బుసలు కొడుతోంది. దాన్ని చూసి మొదట ఒకింత భయపడిన నాగేశ్వరరావు జాగ్రత్తగా పాము బయటకు వెళ్లేందుకు ఏర్పాటు చేశాడు. విషయం అర్థమైన పాము అక్కడ నుంచి మెల్లగా వెళ్ళిపోయింది. నాగేశ్వరరావు ఏమరపాటుగా రోజూ వేసే మేత నే కదా అని జారులో చేయి పెట్టి ఉంటే పాముకాటుకు గురయ్యేవాడు. జాగ్రత్తగా ఉండటంతో అతనికి పెను ప్రమాదమే తప్పింది. అందుకే ఈ సీజన్ లో ముఖ్యంగా వ్యవసాయపనులకు వెళ్లే వాళ్ళు , గ్రామాల్లో నివసించే వాళ్ళతో పాటు కాలువల సమీపంపంలో ఇండ్లు ఉన్నవాళ్లు… పొదలు , చెట్లు అధికంగా ఉన్నచోట నివసించే అందరూ జాగ్రత్తగా ఉండాలి.

పాము వీడియో దిగువన చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..