AP CM Tour: నేడు నెల్లూరుజిల్లాలో సీఎం జగన్ పర్యటన.. రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన..
11.గంటలకు రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. పోర్టు నిర్మాణం తొలిదశ పనులనుఁ 3736.14 కోట్లతో చేపట్టనున్నారు.
AP CM Tour: రామాయపట్నం పోర్టు ఏరియాలోనే పారిశ్రామిక కారిడార్‌ను తీసుకొస్తామన్నారు ఏపీ సీఎం జగన్. పోర్టు నిర్మాణంతో కందుకూరు, కావలి రూపురేఖలు మారిపోతాయన్నారు. అనుమతులు లేకపోయినా గత ప్రభుత్వం శంకుస్థాపన పేరుతో జనాన్ని మోసం చేసిందన్నారు.
నెల్లూరు జిల్లాలో రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన చేశారు సీఎం జగన్. రూ.3736 కోట్లతో చేపట్టే తొలిదశ పనులకు భూమి పూజ చేశారు. డ్రెడ్జింగ్ జరిగే ప్రాంతంలో సముద్రుడికి పట్టువస్త్రాలను సమర్పించారు.
పోర్టు నిర్మాణంతో రామాయపట్నం ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోతాయన్నారు సీఎం జగన్. పారిశ్రామిక కారిడార్ కూడా వచ్చేలా చూస్తామన్నారు. ఏపీలో 50 కిలోమీటర్లకు ఒక ఫిష్షింగ్ హార్బర్, ఒక పోర్టు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోర్టుల్లోనూ 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే వస్తాయన్నారు. రామాయపట్నం పోర్టుకు భూములు ఇచ్చిన వారికి చేతులు జోడించి మరీ ధన్యవాదాలు చెప్పారు జగన్. అనుమతులు రాకపోయినా, డీపీఆర్ లేకపోయినా ఎన్నికలకు రెండు నెలల ముందు చంద్రబాబు పోర్టుకు శంకుస్థాపన చేశారని విమర్శించారు ముఖ్యమంత్రి జగన్.
కందుకూరు, కావలిలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం. మరోవైపు రామాయపట్నం పోర్టు తొలిదశ పనులను 36 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలి దశలో నాలుగు బెర్త్‌ల్లో 25 మిలియన్ టన్నుల కార్గో సామర్థ్యం ఉంటుంది. రెండు దశల్లో కలిపి రూ.10,640 కోట్లతో పోర్టు నిర్మాణం పూర్తవుతుంది. మొత్తం ప్రత్యక్షంగా పది వేల మందికి, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి వస్తుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..