Tirumala Darshan: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇవాళ్టి నుంచి ఆన్‌లైన్‌లో అంగప్రదక్షణ టోకెన్లు..
Angapradakshinam tokens: అంగప్రదక్షణ టోకెన్లను ఆన్‌లైన్‌లో అందించనున్నారు. తిరుమల శ్రీవారి భక్తులకు ఆగస్టు నెలకు సంబంధించిన అంగప్రదక్షణ టోకెన్లను బుధవారం ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు..
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇవాళ్టి నుంచి అంగప్రదక్షణ టోకెన్లను ఆన్‌లైన్‌లో అందించనున్నారు. తిరుమల శ్రీవారి భక్తులకు ఆగస్టు నెలకు సంబంధించిన అంగప్రదక్షణ టోకెన్లను బుధవారం ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను టీటీడీ వెబ్ సైట్‌లో పేర్కొంది. ఆగస్టు నెలకు సంబంధించి మొత్తం 20,250 టోకెన్లు కాగా శుక్రవారం మినహా మిగతా రోజుల్లో 750 టోకెన్ల చొప్పున కేటాయిచనున్నట్లుగా వెల్లడించింది. అంగప్రదక్షిణ టికెట్లు పొందిన భక్తులు.. అర్థరాత్రి దాటిన తర్వాత పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి తడి బట్టలతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మీదుగా ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆలయంలోకి ప్రవేశించే భక్తులు ముందుగానే వెండి వాకిలి దాటి బంగారు వాకిలికి చేరుకోవాలి. సుప్రభాత సేవలో భక్తులు అంగ ప్రదక్షిణ మొక్కులు తీర్చుకుంటారు.
కోవిడ్ కారణంగా తిరుమలలో రెండేళ్లుగా అంగప్రదక్షిణ టోకెన్లు నిలిచిపోయాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఏప్రిల్ నెల నుంచి మళ్లీ ఈ టోకెన్లను టీటీడీ అందిస్తోంది. అయితే సీఆర్ఓ కార్యాలయంలో ఆఫ్ లైన్ లో అందుబాటులో ఉండేవి. జూలై నుంచి ఆన్ లైన్ లో అంగప్రదక్షిణ టికెట్లు అందిస్తున్నారు. అయితే ఇకముందు నేరుగా టీటీడీ వెబ్ సైట్ ద్వారా ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
తిరుపతికి ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు ఇవే..
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే.. రైలు సర్వీసులను పెంచుతున్న విషయం తెలిసిందే. తాజాగా.. సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో 30 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు ఎస్‌సీఆర్ మంగళవారం ప్రకటించింది. ఈ రైళ్లు హైదరాబాద్ – తిరుపతి, కాచిగూడ-నర్సాపూర్, తిరుపతి-కాచిగూడ మధ్య నడవనున్నాయి. రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని.. అదేవిధంగా తిరుమల తిరుపతికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక సర్వీసులను నడపనున్నారు.
- 07643 హైదరాబాద్ – తిరుపతి మధ్య జూలై 25, ఆగస్ట్ 1, 8, 15, 22, 29 తేదీల్లో ట్రైన్స్ నడవనున్నాయి.
- 07644 తిరుపతి – హైదరాబాద్ మధ్య జూలై 26, ఆగస్ట్ 2, 9, 16, 23, 30 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడువనున్నాయి.
- 07612 కాచిగూడ – నర్సాపూర్ మధ్య జూలై 25, ఆగస్ట్ 1, 8, 15, 22, 29 తేదీల్లో రైళ్లు నడుస్తాయి.
- 07613 నర్సాపూర్- కాచ్చిగూడ మధ్య జూలై 26, ఆగస్ట్ 2, 9, 16, 23, 30 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.
- 07614 తిరుపతి- కాచిగూడ మధ్య జూలై 27, ఆగస్ట్ 3, 10, 17, 24, 31 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.