YSRCP: ‘సిద్దం’ సభల తర్వాత ఎన్నికల ప్రచారం, ప్లానింగ్‌పై సీఎం జగన్ సమీక్ష..
ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వై నాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి.. దానికనుగుణంగా పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే సిద్దం పేరుతో ఎన్నికల సమరశంఖం పూరించారు ముఖ్యమంత్రి జగన్. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు సిద్దం బహిరంగ సభల నిర్వహణ ద్వారా పార్టీ కేడర్‌లో జోష్ పెంచారు. పార్టీలో కింది స్థాయి కార్యకర్తలకు సైతం దగ్గరయ్యేలా సిద్దం సభలు నిర్వహించారు. మొదటి సభను ఉత్తరాంధ్రలోని భీమిలిలో నిర్వహించారు. రెండోసారి సిద్దం సభను ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వై నాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి.. దానికనుగుణంగా పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే సిద్దం పేరుతో ఎన్నికల సమరశంఖం పూరించారు ముఖ్యమంత్రి జగన్. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మూడు సిద్దం బహిరంగ సభల నిర్వహణ ద్వారా పార్టీ కేడర్‌లో జోష్ పెంచారు. పార్టీలో కింది స్థాయి కార్యకర్తలకు సైతం దగ్గరయ్యేలా సిద్దం సభలు నిర్వహించారు. మొదటి సభను ఉత్తరాంధ్రలోని భీమిలిలో నిర్వహించారు. రెండోసారి సిద్దం సభను ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించారు. మూడో సభను ఈనెల 18న ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించారు. ఈ సభలకు కనీవినీ ఎరుగని రీతిలో పార్టీ కేడర్‌తో పాటు కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. ఈ సభలకు ముందు వరకూ ప్రభుత్వ కార్యక్రమాల కోసం బహిరంగ సభల్లో పాల్గొనేవారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ కార్యక్రమాలు కావడంతో ప్రతిపక్షాల విమర్శలపై తక్కువగానే స్పందించేవారు. అయితే సిద్దం సభల్లో మాత్రం తెలుగుదేశం పార్టీతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలను టార్గెట్‌గా చేసి దూకుడుగా ముందుకెళ్లారు. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై విమర్శలు గుప్పించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఏ రకంగా అందించింది, గత ప్రభుత్వంలో ఏ విధంగా పథకాలు అందేవి అనేది ప్రజలకు అర్ధం అయ్యేలా వివరించారు. చంద్రబాబు ఎన్ని హామీలు ఇచ్చినప్పటికీ వాటిని అమలుచేయలేదని బహిరంగ సభల్లో విమర్శించారు. తనను ఎదుర్కొనలేక ఇతర పార్టీలతో జత కడుతున్నారని ఎద్దేవా చేసారు. ముఖ్యంగా చివరి సిద్దం సభ రాప్తాడులో కనీవినీ ఎరుగని స్థాయిలో జరిగిందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఒక పార్టీ ఎన్నికల సభకు ఇంతపెద్ద ఎత్తున జనం తరలిరావడం ఇదే ప్రధమం అని కూడా చెబుతున్నారు. మూడు సభలు పూర్తయ్యాయి..కేడర్‌లో జోష్ పెరిగింది. ఇక తర్వాత ఏం చేయాలి. ఎలా ముందుకెళ్లాలి.. ఎన్నికల ప్రచారం, ప్రణాళిక ఎలా ఉండాలనే అంశాలపై ప్రస్తుతం సీఎం జగన్ దృష్టి సారించారు.
ఐప్యాక్ టీంతో కలిసి వ్యూహరచన చేసిన సీఎం
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నివేదికలు, ప్రజా స్పందనపై సర్వేలు చేయిస్తుంటారు. ముఖ్యంగా ఐప్యాక్ టీంతో ఎప్పటికప్పుడు పరిస్థితులు అడిగి దానికనుగుణంగా ముందడుగు వేస్తుంటారు. తాజాగా మరోసారి ఐప్యాక్ టీంతో పాటు పార్టీ ముఖ్యనేతలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఇప్పటికే మూడు చోట్ల సిద్దం సభలు పూర్తికావడంతో తరువాత ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుందనే దానిపై చర్చించారు. ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇంచార్జిల మార్పులో ఐప్యాక్ సర్వేలు పరిగణనలోకి తీసుకున్నారు ముఖ్యమంత్రి. తాజా సమావేశంలో ఎన్నికలకు సంబంధించిర వ్యూహాలు, అభ్యర్థుల మార్పులు సంబంధించిన ఫీడ్ బ్యాక్‌పై చర్చించారు. ఏయే స్థానాల్లో సిట్టింగ్‌లు లేదా ఇంచార్జిల పరిస్తితి ఎలా ఉంది.? ఇంకా ఎక్కడైనా మార్పులు చేర్పులు చేయాలా అనే అంశాలపై చర్చించినట్లు తెలిసింది. అలాగే ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టేలా, పార్టీ క్యాడర్‌ను, నేతలను ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం చేయాలని దానిపై చర్చించినట్లు తెలిసింది. సిద్దం సభలతో గతంలో కేడర్‌తో ఉన్న గ్యాప్ తొలగిపోయినట్లే అనే నిర్ణయనికి వచ్చారు. రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రచారం ఎలా ఉండాలనే దానిపై చర్చించారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎక్కువ ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి రాబోయే రోజుల్లో ప్రతిపక్షాలను మరింత ఇరుకున పెట్టేలా జగన్ వ్యూహాలు రచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








