AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఈ చెరువులపై ఫారెస్ట్ అధికారుల నిఘా.. అక్రమార్కులపై ప్రత్యేక చర్యలు..

కొల్లేరు ఈ పేరు వింటేనే విదేశీ పక్షుల కిలకిల రావాలు.. అక్కడ ప్రకృతి రమణీయత గుర్తొస్తాయి. దేశ, విదేశాలనుంచి ప్రతి ఏటా కొల్లేరుకు పెద్ద సంఖ్యలో విదేశీ పక్షులు వలస వస్తాయి. వాటిని చూసేందుకు పర్యాటకులు కొల్లేరు వచ్చేందుకు అమితంగా ఇష్టపడతారు. పర్యాటకుల రాక కోసం ఇప్పటికే వలస పక్షుల విహార కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి పర్యాటకు కావలసిన సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. అయితే గత కొంతకాలంగా కొల్లేరు భూభాగంలో అక్రమ చేపల చెరువుల తవ్వకాలు శాపంగా మారాయి. అయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

AP News: ఈ చెరువులపై ఫారెస్ట్ అధికారుల నిఘా.. అక్రమార్కులపై ప్రత్యేక చర్యలు..
Kolleru Lake
B Ravi Kumar
| Edited By: |

Updated on: Feb 19, 2024 | 6:50 PM

Share

ఏలూరు, ఫిబ్రవరి 19: కొల్లేరు ఈ పేరు వింటేనే విదేశీ పక్షుల కిలకిల రావాలు.. అక్కడ ప్రకృతి రమణీయత గుర్తొస్తాయి. దేశ, విదేశాలనుంచి ప్రతి ఏటా కొల్లేరుకు పెద్ద సంఖ్యలో విదేశీ పక్షులు వలస వస్తాయి. వాటిని చూసేందుకు పర్యాటకులు కొల్లేరు వచ్చేందుకు అమితంగా ఇష్టపడతారు. పర్యాటకుల రాక కోసం ఇప్పటికే వలస పక్షుల విహార కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి పర్యాటకు కావలసిన సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. అయితే గత కొంతకాలంగా కొల్లేరు భూభాగంలో అక్రమ చేపల చెరువుల తవ్వకాలు శాపంగా మారాయి. అయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయినా అక్రమార్కులు వాటిని బేఖాతరు చేయడంతో వారికి చెక్ పెట్టే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రత్యేక టాక్స్ ఫోర్స్ బృందాలతో నిరంతరం గస్తీ ఏర్పాటు చేసి కొల్లేరు ప్రాంత పరిరక్షణ కోసం ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టింది అధికార యాంత్రాంగం. కొల్లేరు అభయారణ్యం ఐదవ కాంటూర్ పరిధిలో ఎక్కడ అక్రమ చేపల చెరువుల తవ్వకాలు జరగకుండా నియంత్రించే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల కాలంలో కొల్లేరు అభయారణ్య పరిసర ప్రాంతాల్లో అక్రమ చేపల చెరువుల త్రవ్వకాలు జరుగుతున్నాయని అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి.

దీంతో అధికారులు అక్రమ చెరువుల తవ్వకాల నియంత్రణ దిశగా చర్యలు చేపట్టారు. అందులో భాగంగా కొల్లేరు అభయారణ్య పరిరక్షణ కొరకు రాజమండ్రి ముఖ్య అటవీ సంరక్షణ అధికారి ఆదేశాల మేరకు డివిజనల్ అటవీశాఖ అధికారి వన్యప్రాణుల విభాగం అధ్యక్షతన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ సిబ్బందిని నియమించారు. బృందానికి పరిసర ప్రాంతాలపై అవగాహన సంబంధించి, సూచనలు తీసుకోవలసిన చర్యలపై ఏలూరు వన్యప్రాణుల విభాగం కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. రాజమండ్రి సర్కిల్ పరిధిలోని అటవీశాఖ అధికారులను సుమారు 52 మంది అటవీ శాఖ అధికారులు, సిబ్బంది కలిసి కొల్లేరు అభయారణ్యంలో ప్రభుత్వ భూములలో చెరువులు తవ్వకాలు జరగకుండా తనిఖీ చేశారు. అందులో భాగంగా వన్యప్రాణుల విభాగం డివిజనల్ అటవీ శాఖ అధికారిణి యం. హిమ శైలజ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ బృందాలు పైడిచింతపాడు, మల్లవరం‌, బొబ్బిలిలంక గ్రామాలలో కొల్లేరు అభయారణ్య భూములను పరిశీలించారు. కొల్లేరు అభయారణ్యం ఐదవ కాంటూరు పరిధిలో ఎక్కడ అక్రమ చేపల చెరువులు త్రవ్వకుండా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎవరైనా అక్రమంగా చేపల చెరువుల త్రవ్వకాలు జరిపితే వారిపై వన్యప్రాణి చట్టం 1972 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీమ్‎ను కొల్లేరు అభయారణ్యంలో నిరంతరం గస్తీ చేపడుతూ ఎక్కడా అక్రమ చేపల చెరువులు త్రవ్వకాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటామని యం. హిమ శైలజ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..